మార్కెట్ విలువతోనే ఎల్ఆర్ఎస్ రుసుం వసూలు

తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే.అయితే ఎల్ఆర్ఎస్ స్కీంను సవరించాలని వస్తున్న ఆరోపణపై ప్రభుత్వం స్పందించింది.

 Telangana, Governament, Revenue, Lrs, Charges, Market Value-TeluguStop.com

ఈ మేరకు నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎల్ఆర్ఎస్ సవరణ సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.క్రమబద్దీకరణ ఛార్జీలకు సంబంధించి తాజా మార్కెట్ విలువను కాకుండా రిజిస్ట్రేషన్ సమయంలో ఉన్న మార్కెట్ విలువ ఆధారంగా ఎల్ఆర్ఎస్ రుసుంను వసూలు చేయనున్నారు.

తెలంగాణ పురపాలక శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.ఎల్ఆర్ఎస్ సవరణకు సంబంధించి ధరలు 2015 నాటి ధరలు అమలు ఉంటుందన్నారు.2015 నాటి ఎల్ఆర్ఎస్ స్లాబ్లతో క్రమబద్దీకరణ రుసుంను వసూలు చేయనున్నట్లు మున్సిపల్ శాఖ వెల్లడించింది.ఇందులో భూమి విలువ ఈ క్రింది విధంగా ఉంటుందన్నారు.మార్కెట్ లో చదరపు గజం ధర రూ.3 వేల వరకు ఉంటే అందులో 20 శాతం ఎల్ఆర్ఎస్ ఛార్జీలు వసూలు చేయనున్నారు.రూ.3,001 నుంచి రూ.5000 వరకు ఉంటే 30 శాతం వరకు వసూలు చేస్తారు.రూ.5,001 నుంచి రూ.10,000 వరకు ఉన్నట్లయితే 40 శాతం, రూ.10,001 నుంచి రూ.20 వేలు ఉన్నట్లయితే రూ.50 శాతం, రూ.20,001 నుంచి రూ.30 వేల వరకు 60 శాతం, రూ.30,001 నుంచి రూ.50వేల ఉంటే రూ.80 శాతం వరకు రుణం వసూలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube