తెలంగాణలో గ్యాస్ హోమ్ డెలివరీకి బ్రేక్.. ఎందుకంటే..!

తెలంగాణాలో ఈ నెల 29 నుండి గ్యాస్ సిలిండర్లు హోం డెలివరీని ఆపేస్తున్నట్టు తెలుస్తుంది.కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతుంది.

 Lpg Dealers Stopped Gas Home Delivery Corona Lockdown, Gas Home Delivery ,lpg Dealers, Telangana Lockdown, Covid Cases-TeluguStop.com

ఈ క్రమంలో గ్యాస్ డీలర్లకు లాక్ డౌన్ నుండి వెసులుబాటు కల్పిస్తున్నారు.ఈ క్రమంలో ఎల్.పీ.జీ డీలర్ల కార్యవర్గ సంఘాలు తమని కూడా ఫ్రంట్ లైన్ వారియస్ గా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.

గ్యాస్ డెలివరీ బోయ్స్, డీలర్లను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు.తెలంగాణాలో కరోనా వల్ల 40 మంది గ్యాస్ సిబ్బంది మృతి చెందినట్టు తెలుస్తుంది.

 LPG Dealers Stopped Gas Home Delivery Corona Lockdown, Gas Home Delivery ,LPG Dealers, Telangana Lockdown, Covid Cases-తెలంగాణలో గ్యాస్ హోమ్ డెలివరీకి బ్రేక్.. ఎందుకంటే..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తమని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తిస్తేనే హోం డెలివరీ చేయగలమని లేదంటే 29 నుండి హోం డెలివరీని ఆపేస్తున్నట్టు వెల్లడించారు.అయితే తెలంగాణాలో ఈ నెల 30 వరకు లాక్ డౌన్ విధించారు.30 తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయన్న దాని మీద ఎల్.పీ.జీ సిబ్బందిల హోం డైలివరీ కొనసాగుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.తెలంగాణాలో లాక్ డౌన్ వల్ల కొద్దిగా కేసులు తగ్గాయని చెబుతున్నారు.

అయితే లాక్ డౌన్ పొడిగించే అంశంపై ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తుంది. అయితే ఇంట్లో ఏది ఉన్నా లేకపోయినా గ్యాస్ అనేది తప్పనిసరిగా ఉండాలి.

మరి అలాంటప్పుడు గ్యాస్ డెలివరీ ఆపేస్తే మాత్రం ప్రజలు ఇబ్బందిపడే అవకాశం ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube