యజమాని మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కుక్క

విశ్వాసంలో జంతువులలో అందరూ ముందుగా చెప్పే పేరు శునకం.అందుకే అవి మనుషుల పెంపుడు జంతువులు అయ్యాయి.

 Loyal Dog Jumps To Death After Owner Loses, Kanpur, Dog Suicide, Uttar Pradesh,-TeluguStop.com

వాటిని చేరదీసి పెంచితే మన బంధువులు, కుటుంబ సభ్యులు కూడా చూపించని విశ్వాసం కుక్కలు చూపిస్తాయి.ఎంతో ప్రేమని చూపిస్తాయి.

అలాగే మన విరోధుల నుంచి కూడా మనల్ని కాపాడుతూ ఉంటాయి.అలాగే నేరస్తులని గుర్తించడంలో కూడా కుక్కలని ఉండే సామర్ధ్యం మనుషులకి ఉండదు.

అంత విశ్వాసంగా ఉండే శునకాలని పెంచిన యజమానులు దూరం అయితే అసలు అవి పూర్తిగా నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాయి.కొంత కాలం మామూలు స్థితికి రాలేవు.

యజమానులతో వాటికున్న అనుబంధం గుర్తు చేసుకొని దిగాలుగా ఉంటాయి.అయితే ఓ శునకం తన యజమాని చనిపోయాడని, ఏక లేడని తెలిసిన తర్వాత ఏకంగా ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.

డాక్ట‌ర్ అనితా రాజ్ సింగ్ కాన్పూర్ హెల్త్ డిపార్ట్ మెంట్ లో జాయింట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేస్తున్నారు.

మాలిక్ పురంలో నివ‌సిస్తున్న అనితా సింగ్ కు తాను ప‌ని చేస్తున్న ఆస్ప‌త్రి ప‌క్క‌న గాయాల‌తో ప‌డి ఉన్న కుక్క పిల్ల‌ను 12 ఏళ్ల క్రితం చేర‌దీసింది.ఆనాటి నుంచి తన సొంత బిడ్డలా ఆ కుక్కని సాకింది.

డాక్ట‌ర్ అనితా రాజ్ సింగ్ బుధవారం కన్నుమూసింది.తన యజమని ఎంతకు స్పందించడం లేదని ఆ కుక్క దిగాలుపడింది.

ఆమె మృత‌దేహాన్ని ఆస్ప‌త్రి నుంచి ఇంటికి తీసుకువ‌చ్చారు.ఇక ఆ కుక్క త‌న య‌జ‌మాని మృత‌దేహాన్ని చూసి రోదిస్తూ క‌న్నీరు పెట్టుకుంది.

కొద్దిసేపటి తర్వాత నాలుగో అంత‌స్తు పైకెళ్లి కింద‌కు దూకి ప్రాణాలు విడిచింది.ఈ ఘటన అక్కడ ఉన్న అందరిని కంటతడి పెట్టించింది.

ఇప్పుడు ఈ ఘటనకి సంబందించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube