అమెరికాలో ఆ మహిళకి కళ్ళు చెదిరే లాటరీ..ఎంతో తెలుసా..??   Lowa Winner Claims Huge Powerball Jackpot     2018-11-07   13:16:47  IST  Surya

మనం నడుస్తూ వెళ్ళేటప్పుడు 100 రూపాయలు దొరికితేనే అదేదో నోట్ల కట్ట దొరికినంత సంబర పడిపోతాం. మరి అలాంటిది వేలు లక్షల దొరికితే వాడు పెద్ద సుదిగాడు అంటాం మరి ఓ లాటరీలో ఊహకందరి రీతిలో కళ్ళు చెదిరిపోయేలా డబ్బులు వస్తే దానిని ఏమనాలు..పేరు పెట్టడానికి కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు చెప్పేది వింటే మీనోళ్ళు తప్పకుండా తెరుచుకోవాల్సిందే…అమెరికాలో ఓ మహిళకి తగిలిన లాటరీలో ఆమె ఏకంగా 1445కోట్ల రూపాయలు గెలుచుకుంది. షాక్ అయ్యారా..సరే ఆ వివరాలలోకి వెళ్తే..

అమెరికాలోని లోవాకు చెందిన లెరిన్నె వెస్ట్ అనే మహిళను దాదాపు 1445 కోట్ల విలువ గల భారీ ‘పవర్ బాల్ లాటరీ’ వరించింది. పవర్ బాల్ లాటరీ మొత్తం విలువ 700 మిలియన్ డాలర్లు కాగా ఈ మొత్తాన్ని ఇద్దరు పంచుకోవాల్సి ఉంటుంది. ఇద్దరిలో ఒకరిగా నిలవడంతో లెరిన్నె వెస్ట్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అక్టోబర్ 27న తీసిన డ్రాలో ఆమె విజేతగా నిలిచింది.

Lowa Winner Claims Huge Powerball Jackpot-

అయితే ఈ భారీ లాటరీ దక్కడంతో ఓ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్న లెరిన్నె వారం క్రితమే రిటైరయింది. లాటరీలో దక్కిన డబ్బుతో ఓ ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలను చేపట్టే ఆలోచనలో ఉంది. తన కూతుళ్ల జీవితాల ఎదుగుదల కోసం ఈ డబ్బును ఖర్చు చేస్తానని ఆమె తెలిపారు…