Lovetoday Movie Ott Streaming: ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న లవ్ టుడే మూవీ.. ఎప్పటినుంచంటే?

ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల్లో బాగా చర్చ జరిగిన సినిమాలలో లవ్ టుడే సినిమా కూడా ఒకటి.తమిళంలో సంచలనాలు సృష్టించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంది.

 Lovetoday Movie Ott Streaming Date Details, Lovetoday Movie , Love Today Movie O-TeluguStop.com

అయితే ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది.అయితే తమిళంలో మాత్రమే డిసెంబర్ 2వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

డిసెంబర్ చివరి వారం నుంచి లవ్ టుడే తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ కానుందని బోగట్టా.ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడం గమనార్హం.

తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటులు కూడా ఉండటం ఈ సినిమాకు మరింత ప్లస్ అయింది.సోషల్ మీడియా, ట్రోల్స్, బాడీ షేమింగ్ లు, మార్ఫింగ్ ఫోటోల గురించి ప్రధానంగా ఈ సినిమాలో చర్చించారు.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించడం ఈ సినిమాకు ప్లస్ అయింది.క్రిటిక్స్ నుంచి మంచి రేటింగ్స్ రావడం కూడా ఈ సినిమాకు ప్లస్ అయింది.

Telugu Love, Love Ott, Love Netflix, Love Telugu-Movie

లవ్ టుడే తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ ను కూడా అధికారికంగా ప్రకటిస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు.లవ్ టుడే సినిమా కథ అందరికీ తెలిసిన కథే అయితే వీకెండ్ కు మంచి సినిమా చూడాలని అనుకునే వాళ్లకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది.

పరిమిత బడ్జెట్ తో తెలుగులో కూడా మంచి సినిమాలను తెరకెక్కించే అవకాశం ఉన్నా చాలామంది దర్శకనిర్మాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు.నేటి తరం ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉంది.

లవ్ టుడే రికార్డులను సొంతం చేసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube