లవ్ స్టోరి థియేటర్ లోనే చూడండి అంటున్న నిర్మాతలు  

love story movie not in ott release, Tollywood, Sekhar Kammula, Sai Pallavi, Naga Chaitanya, Digital Entertainment, Love Story Movie - Telugu Digital Entertainment, Love Story Movie, Love Story Movie Not In Ott Release, Naga Chaitanya, Sai Pallavi, Sekhar Kammula, Tollywood

ఫిదా సినిమాతో క్రేజీ హీరోయిన్ ని టాలీవుడ్ కి పరిచయం చేసిన శేఖర్ కమ్ముల మరోసారి ఆమెతో లవ్ స్టోరి సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

TeluguStop.com - Lovestory Movie Not In Ott Release

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

రొమాంటిక్ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ గా శేఖర్ కమ్ముల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఇక ప్రేమ కథలకి కేరాఫ్ గా మారిపోయిన సాయి పల్లవి మరోసారి తన పెర్ఫార్మెన్స్ తో ఈ సినిమాలో ఇరగదీయడానికి రెడీ అవుతుంది.

TeluguStop.com - లవ్ స్టోరి థియేటర్ లోనే చూడండి అంటున్న నిర్మాతలు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లో సాయి పల్లవి పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషయం స్పష్టత వచ్చేసింది.ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడి మరల రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది.

ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.ఈ నెల ఆఖరు నాటికి షూటింగ్ పూర్తయిపోయే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాని ఒటీటీలో రిలీజ్ చేస్తారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది.ఈ మధ్యకాలంలో అన్ని సినిమాలు ఒటీటీ బాట పడుతూ ఉండటంతో లవ్ స్టోరి మూవీకి ఒటీటీ చానల్ నుంచి మంచి ఆఫర్ వచ్చిందని, నిర్మాతలు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారని ప్రచారం జరిగింది.

అయితే లవ్ స్టోరి కోసం ఓటీటీ సంస్థ‌లు పోటీ పడుతుండటం వాస్తవమే అయిన ద‌ర్శ‌క నిర్మాత‌లు మాత్రం మా సినిమా ఎవ‌రికీ అమ్మ‌బోవ‌డం లేదు అంటూ క్లారిటీ ఇచ్చేశారు.త‌మ సినిమాని థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఓటీటీ ఆఫ‌ర్లు వ‌చ్చిన మాట నిజం.కానీ మా సినిమాని ఓటీటీకి ఇవ్వ‌బోవ‌డం లేదు.

ఈ సినిమాని థియేట‌ర్ల‌లోనే చూడాలి అంటూ నిర్మాత స్ప‌ష్టం చేశారు.సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మరో టీజర్ రిలీజ్ చేయడానికి దర్శకుడు శేఖర్ కమ్ముల సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది.

అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకొని సంక్రాంతి బ‌రిలో నిల‌పాల‌న్న‌ది శేఖ‌ర్ క‌మ్ముల ప్లాన్ చేస్తున్నారు.సాయి పల్లవికి ఉన్న క్రేజ్ నేపధ్యంలో సినిమాకి మంచి ఓపెనింగ్స్ గ్యారెంటీగా వస్తాయని నిర్మాతలు కూడా బలంగా నమ్ముతున్నారు.

ఈ నేపధ్యంలో సంక్రాంతిని టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.

#Naga Chaitanya #Sai Pallavi #LoveStory #Sekhar Kammula

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Lovestory Movie Not In Ott Release Related Telugu News,Photos/Pics,Images..