బాయ్ ఫ్రెండ్ ని కలిసేందుకు పర్మిషన్ కావాలంటూ హల్ చల్ చేసిన యువతి…..  

Lovers News Boy Friend Lover Want To Met Hyderabad News - Telugu Boy Friend, Hyderabad Lovers News, Hyderabad News, Lover Want To Met, Lovers News

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ పాటిస్తున్నారు.అయితే ఇందులో భాగంగా అవసరమైన సదుపాయాలు తప్ప మిగిలిన అన్ని సదుపాయాలను మూసి వేయడంతో జనాలు కొంతమేర ఇబ్బంది పడుతున్నసంగతి అందరికీ తెలిసిందే.

 Lovers News Boy Friend Lover Want To Met Hyderabad News

ఐతే ఇందులో ఎక్కువగా ప్రేమికులు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తాము ప్రేమించిన వారిని చూడకుండా ఉండలేకపోతున్నారు.

తాజాగా ఓ యువతి తన తన ప్రియుడిని కలుసుకునేందుకు పర్మిషన్ కావాలి అంటూ హైదరాబాదు నగరంలోని బంజారాహిల్స్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో హల్ చల్ చేసిన ఘటన నిన్నటి రోజున చోటు చేసుకుంది.

బాయ్ ఫ్రెండ్ ని కలిసేందుకు పర్మిషన్ కావాలంటూ హల్ చల్ చేసిన యువతి…..-Latest News-Telugu Tollywood Photo Image

వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నగరంలో ని స్థానిక ప్రాంతంలో ఓ యువతి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటోంది.

అయితే ఇటీవలే ఈ నగరానికి చెందినటువంటి ఓ యువకుడితో ప్రేమలో పడింది.దీంతో ఆ యువకుడిని ప్రేమించాలంటూ వేదించేది.దీంతో ఆ యువకుడు ఆ యువతి ఉన్నటువంటి ఇంటి వద్ద ఆమె కోసం వెతుకుతూ మాట్లాడాలని ప్రయత్నించాడు.దీంతో యువతికి సంబంధించినటువంటి బంధువులు దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా ఆ యువతి తనను ప్రేమించాలని వేధిస్తోందని చెప్పడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు.దీంతో యువకుడిని హెచ్చరించి ఇంటికి పంపేశారు.

ఈ విషయం తెలుసుకున్నటువంటి యువతి వెంటనే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన ప్రియుని కలిసేందుకు అనుమతి ఇవ్వాలంటూ హల్ చల్ చేసింది.యువకుడిని కలిసేందుకు పోలీసులు నిరాకరించడంతో పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని తన నిరసన తెలియజేసింది.

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Young Girl Asking Permission To The Police For Meet Her Boy Friend Related Telugu News,Photos/Pics,Images..