పోలీస్ కమిషనర్ కి ఓ లవర్ వింత ట్వీట్...అదేంటంటే?

ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతున్నది ఏదైనా ఉంది అంటే అది సోషల్ మీడియా అని మనం ఒప్పుకోక తప్పదు.ప్రస్తుతం సోషల్ మీడియా అంటే వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ అనేవి ఇప్పుడు మనిషి జీవితంలో ఒక పార్ట్ అయిపోయాయి.

 Pune Man Seeks Police Help In Love Matter, Love, Girl Friend, Police Commissione-TeluguStop.com

అంతలా సోషల్ మీడియా మనుషుల జీవితాల్ని శాసిస్తున్నది.అయితే ప్రజల అభిరుచుల అనుగుణంగా ప్రజలకు మరింత దగ్గరగా సేవలందించడానికి ప్రభుత్వాలు కూడా వాటివైపు దృష్టి పెట్టాయి.

ముఖ్యంగా ప్రభుత్వంలో ప్రజలకు దగ్గరగా ఎప్పుడూ ఉండేది పోలీసు శాఖ.శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజల ఫిర్యాదులను ట్విట్టర్ ఇలా ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా నమోదు చేసుకుంటారు.

తరువాత వాటిపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తారు.ఇలా ప్రజలకు ఫిర్యాదులను స్వీకరించడం, పలు విషయాలపై అవగాహన కల్పించడంలో భాగంగా పుణె పోలీసులు “లెట్స్ టాక్ పుణె సిటీ” పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ ద్వారా పుణె సీపీ లైవ్ లోకి వచ్చారు.

అయితే రకరకాల సమస్యలపై నెటిజన్లు చేస్తున్న ఫిర్యాదులకు సీపీ సమాధానమిస్తున్నారు.అయితే ఆ సమయంలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్న ఇప్పుడు వైరల్ గా మారింది.నా గర్ల్ ఫ్రెండ్ నా లవ్ అంగీకరించేలా తన గర్ల్ ఫ్రెండ్ ను ఒప్పించాలని సీపీని వేడుకున్నాడు.అయితే ఆ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సీపీ సమాధానమిస్తూ ఆమె ఇష్టపూర్వకంగా అంగీకరిస్తేనే మీకు సహాయం చేయగలమని, ఆమె ఇష్టానికి విరుద్ధంగా మేము ఏమీ చేయలేమని, మీరు కూడా ఆమెకు ఇష్టం ఉంటేనే ముందుకు వెళ్లాలని ఆ నెటిజన్ కి సూచించారు.

ఆ నెటిజన్ కు సీపీ ఇచ్చిన సమాధానాన్ని చూసి అందరూ హర్షం వ్యక్తం చేస్తూ సీపీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube