ప్రియురాలిపై స్నేహితులతో కలిసి దారుణానికి ఒడిగట్టిన ప్రియుడు  

Lover And His Friends Raped On Girl Friend In Kakinada Three Town-

తూర్పు గోదావరి జిల్లా లో దారుణం చోటుచేసుకుంది.ప్రేమించిన ప్రియుడే స్నేహితులతో కలిసి ప్రియురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది...

Lover And His Friends Raped On Girl Friend In Kakinada Three Town--Lover And His Friends Raped On Girl Friend In Kakinada Three Town-

ఈ ఘటనలో బాధితురాలు సోమవారం కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.యువతిపై అత్యాచారానికి పాల్పడిన వారు బొబ్బిలి పృథ్వి, దలాయి శ్యామ్‌కుమార్, వి.సాయి, ఎన్‌.

సాయికుమార్‌‌ లుగా అధికారులు గుర్తించారు.అసలు కేసు వివరాల్లోకి వెళితే…తన స్నేహితుడు అనారోగ్యంతో ఉన్నాడని, పరామర్శకు వెళ్దామని చెప్పి బాధితురాలిని ప్రియుడు పృథ్వి తన ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు.అయితే అక్కడకు వెళ్లిన తర్వాత తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు.

Lover And His Friends Raped On Girl Friend In Kakinada Three Town--Lover And His Friends Raped On Girl Friend In Kakinada Three Town-

మద్యం సేవించి తనపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారని బాధితురాలు పోలీసులకు అందించిన ఫిర్యాదులో పేర్కొంది.బాధితురాలిని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించినట్టు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఈ కేసును ఔన్ టౌన్ సీఐ, త్రీటౌన్ ఇన్‌ఛార్జి సీఐ రామ్మోహనరెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ దారుణానికి ఒడిగట్టిన ఆ నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.