ప్రేమించుకున్నారు .. పెళ్లిచేసుకున్నారు ... 28 ఏళ్ళ తరువాత వృద్ధాశ్రమంలో కలుసుకున్నారు

వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.పెళ్లిచేసుకున్నారు.

 Loved To Marry After 28 Years He Met In The Old Age Home-TeluguStop.com

ఇక అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో ఒక హత్య కేసులో ఇద్దరూ జైలుకి వెళ్లారు.కట్ చేస్తే .తిరిగి 28 ఏళ్ళ తరువాత ఇద్దరూ ఒక వృద్ధాశ్రమంలో కలుసుకున్నారు.తమిళనాడులో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది .శ్రీలంకకు చెందిన బక్కర్‌ ఆలియాస్‌ విజయ (60) శ్రీలంక తమిళుల వైరుద్యం సమయంలో తమిళనాడుకు చేరుకున్నారు.వీధుల్లో నాట్యం అడుతూ జీవనం సాగించేవారు.

విజయ నాట్యానికి ఆకర్షిణితులైన సుబ్రమణియం ఆమెను ప్రేమించాడు.సుబ్రమణియం ఇంట్లో వీరి ప్రేమకు అంగీకరించలేదు.

దీంతో సుబ్రమణియం 1985లో విజయతో కలిసి వెళ్లిపోయాడు.ఇద్దరూ వివాహం చేసుకున్నారు.

అనంతరం వీధుల్లో నాట్యం ఆడుతూ జీవనం సాగించే వారు.రాత్రి వేళల్లో రోడ్డు పక్కన నిద్రిస్తుండగా ఓ వ్యక్తి విజయపై అత్యాచారానికి యత్నించాడు.

సుబ్రమణ్యన్, విజయ ఆగ్రహంతో అతనిపై దాడి చేయగా తలకు గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు.పోలీసులు కేసు నమోదు చేసి సుబ్రమణియన్, విజయను అరెస్ట్‌ చేశారు.1990లో కోవై కోర్టు వారికి జీవిత శిక్ష విధించింది.వేలూరు మహిళా జైల్లో విజయను, పురుషుల జైల్లో సుబ్రమణియన్‌ను ఉంచారు.

జైల్లో విజయకు అనారోగ్యం ఏర్పడి మాట పడిపోయింది.దీంతో 2013లో విజయను విడుదల చేయడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో వేలూరు సమీపం అరియూర్‌లోని వృద్ధాశ్రమంలో చేరారు.

ఇటీవల సుబ్రమణియన్‌ను విడుదల అయ్యాడు.దీంతో సుబ్రమణియన్‌ భార్యను చూసేందుకు వృద్ధాశ్రమానికి చేరుకున్నాడు.

ఆ సమయంలో సుబ్రమణియన్‌ను చూసి విజయ ఉద్వేగానికి లోనయ్యారు.ఆత్మరక్షణ కోసం తాము చేసిన నేరానికి జైలు శిక్ష అనుభవించామని ప్రస్తుతం సొంత గ్రామానికి వెళ్లనున్నట్టు వారు తెలిపారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube