ప్రేమకు రూపం ఉండదు.కులం చూడదు, మతం చూడదు.
రంగు చూడదు, రూపం చూడదు.అది పట్టుకుందంటే ప్రాణం పోయేదాకా వదలి పెట్టదు.
ఈ డైలాగులు అన్నీ నిజమైన ప్రేమికులకు సొంతం.కానీ ఇప్పుడు ఉన్న ప్రేమలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే.
చిన్న చిన్న కారణాలతో కలవడం, చిన్న గొడవలకే విడిపోవడం చూస్తున్నాం.ఇక ప్రేమ పేరుతో వేధించే వారికి అయితే కొదువే లేదు.
ఇంకొందరు అయితే ప్రియురాలిపై ప్రేమ పేరుతో దాడులు చేస్తున్నారు.స్నేహితులతో కలిసి అత్యాచారాలు చేస్తున్న వారిని కూడా చూస్తున్నాం.
అయితే ఇప్పుడు మేం చెప్పబోయే విషయం వింటే ఇలాంటి వారు కూడా ఉన్నారా అని ఆశ్చర్యపోతారు.నిజానికి అన్నీ బాగున్న వారిని ప్రేమిస్తేనే మధ్యలో ఏవేవో కారణాలతో వదిలేస్తున్న వారు ఉన్నారు.
కానీ అతను మాత్రం ఓ దివ్యాంగురాలిని ప్రేమించి, ఎవరు ఏమన్నా వినకుండా అందరినీ ఎదిరించి మరీ ఆమెకు ఓ జీవితాన్ని ఇచ్చాడు.అతని గురించి వింటే నిజంగా ప్రపంచంలోనే ఉత్తమ ప్రేమికుడా అనిపిస్తుంది.
కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందులో నివసించే మూతి వసంతరావు(22) వృత్తి రీత్యా డ్రైవర్ గా పనిచేసుకుంటూ జీవిస్తున్నారు.
ఇక తమకు దగ్గరలోని మణుగూరులో ఉంటున్న దివ్యాంగురాలు అయిన నరసమ్మ (21)ను ఓ పెండ్లిలో చూసిన వసంతరావు.
ఆమెను ఇష్టపడ్డాడు.ఇక ఆమెకూడా వసంతరావును ఇష్టపడింది.
ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు.ఇద్దరూ పెండ్లి చేసుకోవాలనుకుంటే ఇరువురి ఇండ్లలో ఒప్పుకోలేదు.
నరసమ్మ చిన్నప్పటి నుంచే నడవలేదు.ఆమెకు కాళ్లలో ఓ సమస్య ఉంది.
టైలర్‌గా పనిచేస్తోంది.ఇందుకే ఆమెతో పెండ్లికి ఎవరూ ఒప్పుకోలేదు.
దీంతో ఇద్దరూ కలిసి విభిన్న ప్రతిభావంతుల సంఘం వారి సాయంతో ఓ గుడిలో పెండ్లి చేసుకున్నారు.ఇక వధువును వసంతరావు ఎత్తుకుని రావడం అందరినీ భావోద్వేగానికి గురి చేసింది.
.