పబ్‌జీ మాయ.. ప్రేమలో పడ్డ పెళ్లైన మహిళ.. చివరికి ఏమైందంటే?

పబ్‌జీ చాలా మందికి వ్యసనంగా మారిపోయింది.ఇది ఆడుతూ ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.

 Love Through Pubg Married Woman Reached Up To See The Person-TeluguStop.com

కొంతమంది అయితే పబ్‌జీ ఆడనివ్వడం లేదని తల్లిదండ్రులను కూడా చంపిన ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి.ఈ మధ్య మనం సోషల్ మీడియాలో పరిచయం అయ్యి ప్రేమించుకుంటున్న వాళ్ళను చూస్తూనే ఉన్నాం.

కానీ ఇప్పుడు మాట్లాడుకుంటున్న వ్యక్తులు మాత్రం పబ్ జీ ద్వారా ప్రేమలో పడ్డారు.ఆ మహిళకు ఇంతకు ముందే పెళ్లి కూడా జరిగింది.అయినా కూడా పబ్ జీ ద్వారా పరిచయమైన వ్యక్తి ప్రేమలో పడడమే కాకుండా అతడి కోసం ఏకంగా రాష్ట్రాలు దాటి మరి అతడిని కలుసుకునేందుకు వెళ్ళింది.అయితే అక్కడకు వెళ్లి ప్రియుడిని చుసిన తర్వాత ఆ మహిళ ఒక్కసారిగా ఖంగు తిన్నది.

 Love Through Pubg Married Woman Reached Up To See The Person-పబ్‌జీ మాయ.. ప్రేమలో పడ్డ పెళ్లైన మహిళ.. చివరికి ఏమైందంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

పబ్ జి మోజులో పడ్డ ఆ మహిళ పబ్ జి ఆడే మరో వ్యక్తితో పరిచయం అయ్యింది.

ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.ఆ మహిళా హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్రాలో తన భర్త, కుటుంబంతో కలిసి నివసిస్తుంది.

ఆ వ్యక్తి ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసిలో నివసిస్తున్నాడు.ఆ మహిళ అతడిని కలిసేందుకు కుటుంబ సభ్యులకు ఎవ్వరికి చెప్పకుండా హిమాచల్ ప్రదేశ్ నుండి ఉత్తర్ ప్రదేశ్ కు బయల్దేరి వెళ్ళింది.

ఒకవైపు కుటుంబ సభ్యులు ఆమె కనపడడం లేదని కంగారు పడుతుంటే మరోవైపు ఆమె ప్రియుడిని కలిసేందుకు వారణాసి చేరుకుంది.కుటుంబ సభ్యులు చుట్టూ పక్కల వెతికిన కనపడ లేదు.

వారణాసి చేరుకున్న ఆ మహిళ ప్రియుడిని చూడగానే ఒక్కసారిగా ఖంగు తిన్నది.ఎందుకంటే తన ఎవరిని ప్రేమించిందో.

ఎవరి కోసం భర్తను సైతం వదిలేసి వచ్చిందో అతడు ఇంటర్ చదువుతున్న యువకుడు అని తెలుసుకుని షాక్ అయ్యింది.

అప్పుడు ఆమెకు అర్ధమైంది.

ఆమె ఎంత పెద్ద తప్పు చేసిందో అని.అందుకే ఆమె తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని తన కుటుంబానికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పి తనను ఇంటికి తీసుకువెళ్లాలని చెప్పింది.కుటుంబ సభ్యులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను సురక్షితంగా తీసుకొచ్చి కుటుంబ సభ్యులు కు అప్పచెప్పారు.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

#Uttar Pradesh #Married Woman #Pubg

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు