భార్య ప్రేమను పరీక్షించేందుకు నడి రోడ్డు మీద నిలబడ్డ భర్త... కారు ఢీ కొట్టడంతో ఆసుపత్రి పాలు

తాగిన సమయంలో కొందరు ఏం చేస్తారో వారికే తెలియదు.తాగిన మత్తులో నువ్వు ఇలా చేశావంటే తర్వాత రోజు వారిని వారే నమ్మలేని పరిస్థితి ఉంటుంది.

 Love Test Ends Badly After Man Is Hit By Car In Front Of His Wife-TeluguStop.com

కొందరు తాగితే పడిపోతారు, కొందరు మాత్రం తాగితే మొత్తుకుంటూనే ఉంటారు.తాగింది దిగే వరకు ఏదో ఒకటి మాట్లాడటం లేదా గొడవకు దిగడం చేస్తూ ఉంటారు.

తాగుడు ఎక్కువ అయిన ఒక భర్త భార్యకు తనపై ఉన్న ప్రేమ ఏపాటిదో తెలుసుకోవాలనుకున్నాడు.అందుకోసం నడి రోడ్డు మీద నిల్చున్నాడు.

చిమ్మ చీకటి నడి రోడ్డు మీద నిల్చున్న ఆ వ్యక్తిని చాలా వాహనాలు గుర్తించి పక్కకు తప్పకుని వెళ్లాయి.కాని ఒక కారు మాత్రం ఢీ కొట్టింది.

దాంతో చావు బతుకుల మద్య హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే…

చైనాలోని ఝోజియాంగ్‌ అనే నగరంలో పాన్‌ అనే ఒక వ్యక్తి బాగా తాగాడు.

బాగా తాగిన ఆ వ్యక్తి భార్యతో గొడవ పడి ఇంట్లోంచి బయటకు వచ్చాడు.బయటకు వచ్చిన ఆ వ్యక్తి నేను అంటే నీకు ఇష్టం లేదు, నేను చనిపోతే అప్పుడు నీకు సంతోషం అనుకుంటూ రోడ్డు మీదకు నడిచాడట.

ఎంత చెప్పినా వినకుండా నేను అంటే ఇష్టం ఉంటే నన్ను కాపాడు అంటూ రోడ్డుకు అడ్డంగా నిల్చున్నాడు.ఆమె ఎంత లాగినా కూడా పాన్‌ ఇంట్లోకి వెళ్లలేదు.ఇదంతా కూడా రోడ్డు పక్కన ఉన్న ఒక సిసి కెమెరాలో రికార్డు అయ్యింది.సిసి కెమెరాలో రికార్డ్‌ కాకుంటే ఈ విషయాన్ని ఎవరు నమ్మేవారు కాదు.

పాన్‌ ను భార్య ఎంతగా లోనికి తీసుకు వెళ్లాలని ప్రయత్నించినా కూడా ఆమె వల్ల కాలేదు.దాంతో చేసేది లేక మరెవ్వరినైనా తీసుకు రావాలని పక్కకు వెళ్లింది.ఆ సమయంలోనే ఒక కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది.అప్పటికే చాలా వాహనాలు అతడిని గమనించి దగ్గరకు వచ్చి బ్రేక్‌ వేయడం, పక్కకు తప్పుకోవడం చేశాయి.

కాని కారు పాన్‌ను గమనించలేదు.దాంతో యాక్సిడెంట్‌ అయ్యింది.

ప్రాణాలు అయితే దక్కాయి కాని చాలా గాయాలు అయినట్లుగా తెలుస్తోంది.తాగింది దిగిన తర్వాత అయ్యవారికి అసలు సంగతి తెలిసినట్లుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube