లవ్ స్టోరి ట్రైలర్ టాక్.. మళ్లీ అదే స్ట్రాటెజీ వాడిన కమ్ముల

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్యూర్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘లవ్ స్టోరి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి జంటగా నటిస్తుండటంతో ఈ సినిమాపై మొదట్నుండి మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Love Story Trailer Impressive-TeluguStop.com

ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్లు కూడా ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.అయితే రిలీజ్ విషయంల పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమాను సెప్టెంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

కాగా తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ చూస్తుంటే మరోసారి శేఖర్ కమ్ముల హిట్ కొట్టడం ఖాయమని కనిపిస్తుంది.

 Love Story Trailer Impressive-లవ్ స్టోరి ట్రైలర్ టాక్.. మళ్లీ అదే స్ట్రాటెజీ వాడిన కమ్ముల-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ట్రైలర్‌లో బ్యాంక్ లోన్ కోసం తిరిగే యువకుడి పాత్రలో చైతూ కనిపించగా, ఓ సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం కష్టపడే అమ్మాయిగా సాయి పల్లవి కనిపించారు.అయితే వీరిద్దరూ డ్యాన్స్‌లో నైపుణ్యతను కలిగి ఉండటంతో, ఇద్దరూ కలిసి ఓ డ్యాన్స్ ట్రూప్‌గా ఏర్పడి చేసే ప్రయాణంలో వీరిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది.

ఆ ప్రేమను దక్కించుకునేందుకు వారు పడే కష్టాలను మనకు ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.చాలా రోజుల తరువాత ఈ ట్రైలర్ రిఫ్రెషింగ్‌గా ఉండటంతో ప్రేక్షకులు ఇది ఆకట్టుకుంటోంది.

అయితే ఈ సినిమాలో కూడా శేఖర్ కమ్ముల పూర్తిగా తెలంగాణ యాసను వాడుకున్నాడు.హీరోహీరోయిన్లు ఇద్దరూ కూడా తెలంగాణ యాసలోనే మాట్లాడుతున్నారు.

ముఖ్యంగా సాయి పల్లవిని చూస్తే ఫిదా చిత్రంలోని భానుమతి పాత్ర మరోసారి చూస్తున్నట్లు అనిపించింది.మరి ఈ సినిమాకు అది ఎంతవరకు కరెక్ట్‌గా ఉంటుందనేది ఈ సినిమా రిలీజ్ తరువాతే తెలుస్తోంది.

మొత్తానికి లవ్ స్టోరి చిత్రం తమకు ఎందుకంత ప్రత్యేకమో మరోసారి ఈ చిత్ర యూనిట్ నిరూపించింది.ఇక ఈ సినిమా ట్రైలర్‌ను మీరూ ఓసారి చూసేయండి.

#Sai Pallavi #Naga Chaitanya #Love Story #Sekhar Kammula

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు