లవ్‌స్టోరి టీజర్‌ను రెడీ చేస్తోన్న చైతూ  

Love Story Teaser On Akkineni Nageswara Rao Birthday, Love Story, Naga Chaitanya, Sai Pallavi, Sekhar Kammula, Tollywood News - Telugu Love Story, Naga Chaitanya, Sai Pallavi, Sekhar Kammula, Tollywood News

టాలీవుడ్ ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ లవ్‌స్టోరి ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది.ఈ సినిమాతో మరోసారి ఫిదా లాంటి సక్సె్స్ కొట్టాలని ఈ డైరెక్టర్ చూస్తున్నాడు.

TeluguStop.com - Love Story Teaser To Be Soon

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవిని హీరోయిన్‌గా తీసుకున్నాడు.ఇక ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమాపై మొదట్నుండీ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

TeluguStop.com - లవ్‌స్టోరి టీజర్‌ను రెడీ చేస్తోన్న చైతూ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను శేఖర్ కమ్ముల తనదైన మార్క్‌తో తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్ టీజర్స్, ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచాయి.

కాగా ఈ సినిమా టీజర్‌ను ఇప్పటికే రిలీజ్ చేయాల్సి ఉండగా, లాక్‌డౌన్ కారణంగా అది కుదర్లేదు.దీంతో ఇప్పుడు ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

అక్కినేని నాగేశ్వర్ రావు జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 20న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈ టీజర్ ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చడమే కాకుండా, వారికి ఈ సినిమాపై మరింత అంచనాలు ఏర్పడేలా చేస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాతో నాగచైతన్య, సాయి పల్లవి పెయిర్ సూపర్ హిట్ కానుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఇక ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి, రావు రమేష్, దేవయాని కీలక పాత్రల్లో నటిస్తుండగా, పవన్ అనే సంగీత దర్శకుడు ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.

శేఖర్ కమ్ముల ఈ సినిమాను తనదైన మార్క్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి్స్తుండటంతో, మరోసారి క్లీన్ మూవీని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.ఇక ఈ వేసవి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.

మరి ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే ఆసక్తికి తెరపడాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు ఆగాల్సిందే.

#Sekhar Kammula #Love Story #Naga Chaitanya #Sai Pallavi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Love Story Teaser To Be Soon Related Telugu News,Photos/Pics,Images..