రమ - రాజమౌళి ఎక్కడ, ఎప్పుడు ప్రేమలో ఎప్పుడు పడ్డారో తెలుసా?

Love Story Of Rama And Rajamouli

ఎస్ ఎస్ రాజమౌళితెలుగు సినిమా పరిశ్రమలో దిగ్గజ దర్శకుడు.అంతేకాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సత్తా ప్రపంచ వ్యాప్తం చేసిన దర్శకధీరుడు.

 Love Story Of Rama And Rajamouli-TeluguStop.com

ఈయనతో ప్రతి అడుగులో తోడుంటుంది ఆయన సతీమణి రమ.రాజమౌళి, రమ దంపతులను ఆదర్శ దంపతులుగా పిలుస్తారు సినిమా ఇండస్ట్రీ జనాలు.

వీరిద్దరిదీ ప్రేమ పెళ్లి అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.కానీ అది ముమ్మాటికి వాస్తవం.

 Love Story Of Rama And Rajamouli-రమ – రాజమౌళి ఎక్కడ, ఎప్పుడు ప్రేమలో ఎప్పుడు పడ్డారో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీరిద్దరు ప్రేమలో ఎలా పడ్డారు? ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది.ఈ డౌట్స్ అన్నీ తీరాలంటే ఈ స్టోరీ మీరు తెలుసుకోవాల్సిందే.

ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ మూవీకి దర్శకత్వం వహిస్తున్న రాజమౌళి రమను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.నిజానికి అప్పటికే రమకు మరో వ్యక్తితో వివాహం అయ్యింది.కార్తికేయ అనే అబ్బాయి కూడా పుట్టాడు.

అయితే తన భర్తతో విభేదాలు రావడంతో రమ విడాకులు తీసుకున్నారు.ఆ సమయంలో కీరవాణి ఇంట్లోనే రమ ఉండేవారు.కీరవాణి భార్య వల్లి, రమ స్వయంగా అక్కా చెల్లెళ్లు.అందుకే సోదరి దగ్గరే రమా ఉండేది.దీంతో రాజమౌళి తరుచూ సినిమాల గురించి మాట్లాడేందుకు కీరవాణి ఇంటికి వచ్చేవారు.అలా రమతో పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.అనంతరం వీరు పెళ్లి చేసుకున్నారు.

అటు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన శాంతి నివాసం సీరియల్ నుంచి రమతో పరిచయం ఉంది.

రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాకు రమ కాస్టూమ్ డిజైనర్ గా పనిచేసింది.ఆ సమయంలో వీరి ప్రేమ మరింత పెరిగింది.అనంతరం వీరిద్దరు ఎలాంటి హడావిడి లేకుండా వివాహం చేసుకున్నారు.

అప్పటికే రమకు ఓ కుమారుడు ఉన్నాడు.రాజమౌళి ఓ అమ్మాయిన దత్తత తీసుకున్నాడు.

ఆ పాప మయూఖ.ఈ ఇద్దరు పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు రాజమౌళి దంపతులు.

కార్తికేయ కొంత కాలం క్రితం జగపతిబాబు అన్న కుమార్తెను వివాహం చేసుకున్నాడు.

#Keeravani #Castoom #Rama #Love Marrege #Rajamouli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube