లవ్ స్టోరీ.. అక్కినేని ప్రేమ నగర్ అంటున్న నాగార్జున?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించినటువంటి చిత్రం “లవ్ స్టోరీ”. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.

 Love Story Nagarjuna As Akkineni Prema Nagar-TeluguStop.com

ఎట్టకేలకు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24వ తేదీ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు.

ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునీ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.

 Love Story Nagarjuna As Akkineni Prema Nagar-లవ్ స్టోరీ.. అక్కినేని ప్రేమ నగర్ అంటున్న నాగార్జున-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సారంగదరియా రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించిన సంగతి మనకు తెలిసిందే.

ఇక నిన్న విడుదల చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.ఇకపోతే నాగచైతన్య లవ్ స్టోరీ ట్రైలర్ పై నాగార్జున స్పందిస్తూ… “లవ్ స్టోరీ” సినిమాను అక్కినేని నాగేశ్వరావు నటించిన “ప్రేమ నగర్” సినిమాతో పోల్చారు.

Telugu Love Story, Nagarjuna, New Movie, Sai Pallavi, Tollywood-Movie

ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా నాగార్జున 1971 సెప్టెంబర్ 24వ తేదీ అక్కినేని నాగేశ్వరావు నటించిన ప్రేమ నగర్ సినిమా విడుదల కాగా.2021 సెప్టెంబర్ 24 నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా విడుదల కాబోతుందని.నాగచైతన్య లవ్ స్టోరీని నాగేశ్వరరావు ప్రేమనగర్ తో పోలుస్తూ.లవ్ స్టోరీ చూడటానికి బాగుంది రా ఛై.ఆల్ ద బెస్ట్ అని నాగార్జున తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

#Love Story #Sai Pallavi #Nagarjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు