లవ్ స్టోరి సినిమాకు వినాయకుడి శాపం తగిలిందా?

టాలీవుడ్ ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘లవ్ స్టోరి’ ఎప్పుడో షూటింగ్ ముగించుకుంది.అన్నీ బాగుంటే మరికొన్ని గంటల్లో ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

 Love Story Movie Vinayaka Chaviti Release Effected, Love Story, Naga Chaitanya,-TeluguStop.com

కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.ఈ సినిమాను తొలుత ఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

కానీ కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు చిత్ర యూనిట్.

ఇక ఈ సినిమాను వినాయక చవితి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా రిలీజ్‌కు వినాయకుడి శాపం తగిలిందని పలువురు నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.సినిమా రిలీజ్ ప్రమోషన్‌లో భాగంగా చిత్ర యూనిట్ వ్యవహరించిన తీరే దీనికి కారణమని వారు అంటున్నారు.

‘వినాయక చవితి’ ప్లేస్‌లో ‘వినాకయ చవితి’ అని తప్పుగా ప్రచురించి చిత్ర యూనిట్ నవ్వులపాలైంది.దీంతో వెంటనే తేరుకుని తమ పొరపాటును దిద్దుకున్నారు లవ్ స్టోరి చిత్ర యూనిట్.

అయితే ఈ రిలీజ్ పోస్టర్‌ను నెటిజెన్లు విపరీతంగా ట్రోల్ చేశారు.

ఇప్పుడు ఇదే వారి కొంప ముంచిదని మరోసారి నెటిజెన్లు అంటున్నారు.

వినాయక చవితిని తప్పుగా ప్రచురించిన సినిమా పండుగ రిలీజ్‌ను చేసుకోలేకపోయిందని వారు అంటున్నారు.ఏదేమైనా వినాయకుడి లాంటి దేవుడి పండుగ విషయంలో తప్పు చేయడం ఏమాత్రం సరికాదని పలువురు కామెంట్ చేస్తున్నారు.

అందుకే ఈ సినిమాకు వినాయకుడి శాపం తగిలి రిలీజ్‌కు నోచుకోలేదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.మొత్తానికి లవ్ స్టోరి చిత్ర యూనిట్ చేసిన తప్పుకు భగవంతుడు కూడా శిక్షించాడని నెటిజెన్లు మరోసారి ఈ సినిమాను ట్రోల్ చేస్తున్నారు.

అయితే ఏపీలో నెలకొన్న టికెట్ ధరల అంశం కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిందని చిత్ర యూనిట్ పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube