'లవ్ స్టోరీ' ట్రైలర్ ముహూర్తం ఫిక్స్.. ప్రకటించిన చైతు!

అక్కినేని నాగ చైతన్య ప్రెసెంట్ చేస్తున్న సినిమాల్లో లవ్ స్టోరీ సినిమా ఒకటి.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఇంకా విడుదలకు నోచుకోలేదు.

 Love Story Movie Theatrical Trailer Release Tomorrow, Love Story, Love Story On-TeluguStop.com

కరోనా కారణంగా వరుసగా వాయిదా పడుతూ వస్తుంది.ఈ మధ్య సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా విడుదల చేస్తామని ప్రకటించి మళ్ళీ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

అయితే మళ్ళీ ఈ మధ్య సెప్టెంబర్ 24 న విడుదల చేస్తామని కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.

అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేస్తున్నట్టు నాగ చైతన్య సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించాడు.ఈ రోజు చైతన్య ఈ సినిమా ట్రైలర్ రేపు ఉదయం సెప్టెంబర్ 13న 11 గంటల 7 నిముషాలకు విడుదల చేస్తున్నట్టు తెలిపారు.

థియేట్రికల్ ట్రైలర్ ఆఫ్ రేవంత్, మౌనిక #లవ్ స్టోరీ అంటూ నాగ చైతన్య తన సోషల్ మీడియాలో ఖాతా ద్వారా తెలిపారు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాను లవ్ స్టోరీ తెరకెక్కించడంలో నిపుణత ఉన్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించడంఅందులోను నాచురల్ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి కథానాయికగా నటించడంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లోకి వెళ్లిపోయాయి.ఇక చైతన్య సాయి పల్లవి జంట తెరమీద ఎంత అందంగా ఉంటుందో అని అభిమానులు చూడడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్, టీజర్, పాటలు అన్ని కూడా ప్రేక్షకులను అలరించాయి.ఇప్పుడు ఇక ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంటుందని అనుకుంటున్నారు.ఈ సినిమాను శేఖర్ కమ్ముల లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాకు పవన్ సిహెచ్ అందించిన సంగీతం గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక ఈ సినిమాను అమిగోస్ క్రియేషన్స్ తో కలిసి నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ సంయుక్తంగా నిర్మించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube