లవ్‌స్టోరిని వెనక్కి నెట్టేసిన కమ్ముల  

Love Story Movie Release Postponed - Telugu Love Story, Naga Chaitanya, Sai Pallavi, Sekhar Kammula, Telugu Movie News

ఫీల్ గుడ్‌ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం లవ్ స్టోరీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.అక్కినేని నాగచైతన్య, ఫిదా బ్యూటీ సాయి పల్లవిలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Love Story Movie Release Postponed - Telugu Naga Chaitanya Sai Pallavi Sekhar Kammula News

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.

ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ ప్రివ్యూ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.

కాగా ఈ సినిమాను ప్రేమికుల రోజు సందర్భంగా రిలీజ్ చేయాలని అనుకున్న చిత్ర యూనిట్, షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.కానీ ఇప్పుడు ఈ సినిమా మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను ఏప్రిల్ 16న రిలీజ్ చేయాలని చూసిన శేఖర్ కమ్ముల ఇప్పుడు ఏకంగా జూన్ నెలలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.

నాగచైతన్య, సాయి పల్లవిలు జంటగా నటిస్తున్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోండగా, శేఖర్ కమ్ముల తనదైన మార్క్ టేకింగ్‌తో ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

తాజా వార్తలు

Love Story Movie Release Postponed-naga Chaitanya,sai Pallavi,sekhar Kammula,telugu Movie News Related....