'ఆచార్య' సినిమాను రీప్లేస్ చేయబోతున్న 'లవ్ స్టోరీ'..!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఫిదా హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

 Love Story Movie Release On May-TeluguStop.com

శేఖర్ కమ్ముల సినిమా లంటే ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే.ఆయన తెరకెక్కించే ప్రేమ కథలు కొత్తగా మనసుకు హత్తుకునేలా ఉంటాయి.

ఈ సినిమాపై కూడా అంతే అంచనాలు నెలొకొన్నాయి.

 Love Story Movie Release On May-ఆచార్య’ సినిమాను రీప్లేస్ చేయబోతున్న లవ్ స్టోరీ’..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందులో ఈ సినిమాలో సాయి పల్లవి నటిస్తుండడం వల్ల ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.

అయితే ఈ సినిమా ఏప్రిల్ 16 న విడుదల కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే.పరిస్థితులు చక్కబడిన తర్వాత విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.

అయితే తాజాగా ఈ చిత్ర యూనిట్ ఈ సినిమాను మే లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.ఎలాగో మే 13 న విడుదల కావాల్సిన ఆచార్య సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నందున లవ్ స్టోరీ సినిమా ను మే 13 న విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తుంది.కరోనా పరిస్థితులు చక్కబడితే మే లో రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారట.

ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, పోస్టర్స్, పాటలు అన్నీ రికార్డులు సృష్టిస్తున్నాయి.ఈ సినిమా నుండి విడుదలైన సారంగ దారియా సాంగ్ రికార్డులు బ్రేక్ చేసింది.

ఈ సినిమాకు పవన్ సి హెచ్ సంగీతం అందించారు.ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మరి చూడాలి ఈ సినిమా మే లో రిలీజ్ అవుతుందో లేక మళ్ళీ వాయిదా పడుతుందో.

#Sai Pallavi #Release Update #LoveStory #Shekar Kammula #Acharya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు