వినాయక చవితికి రాబోతున్న 'లవ్ స్టోరీ'.. డేట్ ఫిక్స్ !

సినిమా సినిమాకి గుర్తింపు తెచ్చుకుంటూ మెల్లగా ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్తున్నాడు అక్కినేని యువ హీరో నాగ చైతన్య.ప్రస్తుతం నాగ చైతన్య నటిస్తున్న సినిమాల్లో లవ్ స్టోరీ ఒకటి.

 Love Story Movie Release Date Fixed, Naga Chaithanya, Love Story, Sai Pallavi, S-TeluguStop.com

ఈ సినిమాను లవ్ స్ట్రోరీస్ తెరకెక్కించడంలో దిగ్గజ డైరెక్టర్ అయినా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ముద్దు గుమ్మ సాయి పల్లవి హీరోయిన్ గా నటించడంతో మరింత అంచనాలు పెరిగాయి.

ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.ఏప్రిల్ 16 నే విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.

అప్పటి నుండి ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ మళ్ళీ ప్రకటించలేదు.అయితే ఈ మధ్యనే కరోనా నుండి కోలుకుని థియేటర్స్ ఓపెన్ అవ్వడం తో మళ్ళీ అన్ని సినిమాలు విడుదలకు సిద్ధం అయ్యాయి.

Telugu Love Story, Naga Chaithanya, Sai Pallavi, Sekhar Kammula, September-Movie

వస్తున్న సమాచారం మేరకు లవ్ స్టోరీ సినిమాను కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.తాజాగా వస్తున్న బజ్ ప్రకారం ఈ సినిమాను వినాయక చవితి కానుకగా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.అంతేకాదు సెప్టెంబర్ 10 న విడుదల చేయాలనీ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.Telugu Love Story, Naga Chaithanya, Sai Pallavi, Sekhar Kammula, September-Movie

పరిస్థితులు మారకుండా థియేటర్స్ ఓపెన్ ఉంటే మాత్రం లవ్ స్టోరీ సినిమా ఖచ్చితంగా సెప్టెంబర్ 10 న వస్తుందని తెలుస్తుంది.ఒక వేళ కరోనా మళ్ళీ అడ్డుగా వస్తే ఈ సారి ఓటిటీ లో రిలీజ్ అవుతుందని కూడా మరొక టాక్ వినిపిస్తుంది.మొత్తానికి కరోనా కారణంగా సినిమా విడుదల తేదీలు కన్ఫర్మ్ చేయలేక పోతున్నారు మేకర్స్.చూడాలి మరి ఈ సినిమా వినాయక చవితి కానుకగా మన ముందుకు వస్తుందో లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube