పండగ బరిలో దిగనంటోన్న లవ్‌స్టోరి  

Love Story Movie Release Date Changed, Love Story, Naga Chaitanya, Sai Pallavi, Tollywood News - Telugu Love Story, Naga Chaitanya, Sai Pallavi, Tollywood News

టాలీవుడ్ ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లవ్‌స్టోరి’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, ఫిదా బ్యూటీ సాయి పల్లవి కలిసి నటిస్తున్న ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

TeluguStop.com - Love Story Movie Release Date Changed

ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశకు చేరుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అందుకోవాలని శేఖర్ కమ్ముల చూస్తున్నాడు.కాగా ఈ సినిమాను ఇప్పటికే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.

దీంతో ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తారని తొలుత వార్తలు వినిపించాయి.

TeluguStop.com - పండగ బరిలో దిగనంటోన్న లవ్‌స్టోరి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే సంక్రాంతి సీజన్‌లో కొన్ని బడా సినిమాలు పోటీ పడుతుండటంతో ‘లవ్‌స్టోరి’ చిత్రాన్ని సంక్రాంతి బరిలో రిలీజ్ చేయకపోవడమే మంచిదని చిత్ర యూనిట్ నిర్ణయించింది.

దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను వాలెంటైన్స్ డేకు మార్చినట్లు తెలుస్తోంది.

అప్పుడైతే పెద్దగా సినిమాలు రిలీజ్ కావని, రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రాలకు ఆ సీజన్ బాగా కలిసొస్తుందని శేఖర్ కమ్ముల భావిస్తున్నాడు.అందుకే లవ్ స్టోరి చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఈ సినిమాలో చైతూ-సాయి పల్లవిల మధ్య నడిచే రొమాంటిక్ సీన్స్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనున్నాయి.మరి లవ్ స్టోరి చిత్రం లవర్స్ డే రోజున ఎలాంటి ట్రీట్ అందిస్తుందో చూడాలి.

#Naga Chaitanya #Love Story #Sai Pallavi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Love Story Movie Release Date Changed Related Telugu News,Photos/Pics,Images..