ఎవరో ఏదో మాట్లాడితే సినిమా ఇండస్ట్రీ కి సంభందం లేదన్న నిర్మాత...

టాలీవుడ్ సినిమా పరిశ్రమలోని సినీ నిర్మాతలు ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ మంత్రి పేర్ని నాని తో భేటీ అయిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఇందులో భాగంగా ప్రజలకు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం మరియు సినిమా ప్రమోషన్స్ కోసం తప్పుడు కలెక్షన్లను చూపిస్తూ చేస్తున్న మోసాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి వాటి గురించి సినిమా ప్రొడ్యూసర్లు చర్చించారు.

 Love Story Movie Director Narayan Das Narang Sensational Comments On Pawan Kalya-TeluguStop.com

దీంతో ఈ సమావేశంలో దాదాపుగా టాలీవుడ్ లోనే చిన్న సినీ నిర్మాతల నుంచి దిల్ రాజు, సి.కళ్యాణ్ మరియు ప్రముఖ సినీ నిర్మాత అయిన నారాయణ దాస్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు.అయితే ఈ భేటీ అనంతరం సినీ నిర్మాత నారాయణ దాస్ నారంగ్ పత్రికా సమావేశంలో పాల్గొని పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా ప్రస్తుతం అటువంటి పరిస్థితులలో సినీ నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలు వంటివాటి గురించి మంత్రి పేర్ని నాని తో చర్చించినట్లు తెలిపాడు.

అలాగే సినిమా ఇండస్ట్రీలోకి రాజకీయ జోక్యం అవసరం లేదని ఈ విషయం గురించి కూడా మాట్లాడినట్లు తెలిపాడు.అయితే పరోక్షంగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యల గురించి స్పందిస్తూ ఎవరో ఏదో మాట్లాడితే ఆ వ్యాఖ్యలకి సినిమా ఇండస్ట్రీ కి ఎలాంటి సంబంధం లేదని కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని రాజకీయాలతో ముడి పెట్టడం అలాగే సినిమా ఇండస్ట్రీలో కొత్త సమస్యలకి తెర లేపడం మంచిది కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

దీంతో ఈ విషయంపై కొందరు నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.

Telugu Love Story, Lovestory, Yan Das, Pawan Kalyan, Prouder, Tollywood-Movie

అంతే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ శ్రేయస్సు కోసం పాటు పడుతుంటే సినీ పెద్దల నుంచి మాత్రం స్పందన కరువైందని కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా పవన్ కళ్యాణ్ స్వలాభం కోసం మాత్రమే మాట్లాడటం లేదని సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం గురించి మాట్లాడుతున్నాడని అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు నుంచే సినిమా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నాడని కనీసం ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మద్దతు తెలపాలని సూచిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా సినీ నిర్మాత నారాయణ దాస్ నారంగ్ ఇటీవలే తెలుగులో నాగ చైతన్య మరియు సాయి పల్లవి జంటగా నటించిన “లవ్ స్టోరీ” అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు.

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.అంతే కాకుండా ఈ చిత్రం దర్శక నిర్మాతలకి కాసుల వర్షం కురిపిస్తోంది.విడుదలైన మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం దాదాపుగా 21 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube