లవ్ స్టోరీ హిట్ కొడితే ఆ క్రెడిట్ దక్కేది సాయి పల్లవికే..

సాయి పల్లవి.తమిళ నాట పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ.

 Love Story Movie Credit To Sai Pallavi-TeluguStop.com

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది.తొలి సినిమాతోనే తెలుగు ప్రజల మనసులను దోచుకుంది.

ఈ సినిమా హిట్ కొట్టడంతో ఆమెకు మంచి పేరు వచ్చింది.ఆ సినిమా తర్వా తెలుగులో తనకు వరుస ఆఫర్లు వచ్చాయి.

 Love Story Movie Credit To Sai Pallavi-లవ్ స్టోరీ హిట్ కొడితే ఆ క్రెడిట్ దక్కేది సాయి పల్లవికే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా శేఖర్ కమ్ముల సాయి పల్లవితో మరో సినిమా తీస్తున్నాడు.ఆ సినిమా మరేదో కాదు.

లవ్ స్టోరీ.తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రివ్యూ షో వేశారు.

ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు సాయి పల్లవి నటనపై ప్రశంసల జల్లు కురిపించారు.ఈ సినిమా హిట్ అయితే మాత్రం ఆ క్రెడిట్ అంతా సాయి పల్లవికే దక్కుతుందంటున్నారు సినీ పెద్దలు.

నిజానికి సాయి పల్లవి బాగా నటించగలదు.అంతకు మించి డ్యాన్స్ చేయగలదు.మొదటు పలు టీవీ షోలలో డ్యాన్స్ చేసే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాతే సినిమాల్లోకి అడుగు పెట్టింది.

ఈ సినిమాలోనూ సాయి పల్లవి అద్భుతంగా డ్యాన్స్ చేసిందట.ఆమె స్టెప్పులకు థియేటర్ లోని వాళ్లంతా చప్పట్లు కొట్టారట.

నటనకు రూపం అడ్డుకాదని నిరూపించింది సాయి పల్లవి.ఏవరేజ్ అమ్మాయి అయితేనేం.

అద్భుతంగా సినిమాల్లో రాణిస్తుంది.

Telugu About Sai Pallavi, Director Sekhar Kammula, Love Story Credit, Love Story Movie, Naga Chaitanya, Sai Pallavi, Sai Pallavi Cine Career, Sai Pallavi Dance, Star Directors, Tollywood-Movie

ఈ రోజుల్లో హీరోయిన్ అంటే అందంగా ఉండాలి.అంగాంగ ప్రదర్శన చేయాలి.అప్పుడే మన దర్శకులకు నచ్చుతుంది.

సాయి పల్లవి లాంటి అమ్మాయి నిజంగా తెలుగు డైరెక్టర్లు తీసుకునే సాహసంచేయరు.కానీ తన నటన ముందు మిగతావన్నీ దిగదుడుపే అని నిరూపించింది సాయిపల్లవి.

ప్రస్తుతం స్టార్ దర్శకులు సైతం తన డేట్ల కోసం క్యూ కట్టే పరిస్థితి ఏర్పడింది.అటు తను చేసే ఏ క్యారెక్టర్ అయినా.

అత్యద్భుతంగా నటిస్తుంది.కింది స్థాయి నుంచి వచ్చిన ఈ అమ్మాయి.

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలో ముందుకు సాగడం నిజంగా అభినందనీయం.

#Naga Chaitanya #Sai Pallavi #Sekhar Kammula #Love Story #Sai Pallavi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు