మరో వారం కూడా లవ్‌ స్టోరీ జోరు కంటిన్యూ ఇదే సాక్ష్యం

నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్‌ స్టోరీ సినిమా చాలా వెయిటింగ్ తర్వాత ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాకు అనుకున్న రేంజ్ లో సక్సెస్ దక్కింది.

 Love Story Movie Collections One More Week , @republic, Flim News, Love Story, N-TeluguStop.com

కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం లో ఉన్న టాలీవుడ్‌ కు లవ్‌ స్టోరీ మంచి సక్సెస్ బూస్ట్‌ అంటూ టాక్ వినిపిస్తుంది.ఈ సమయంలోనే లవ్‌ స్టోరీ సినిమా వసూళ్ల విషయంలో సెకండ్‌ వేవ్‌ తర్వాత సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.

మొదటి వారంలో ఈ సినిమా 35 లక్షల వరకు వసూళ్లను దక్కించుకుంది.టాలీవుడ్‌ లో ఈమద్య కాలంలో ఇంతగా వసూళ్లు సాధించిన సినిమా లేదు.

మొదటి వారం వరకు వసూళ్లు.ఆ తర్వాత కష్టం అనుకున్నారు.

కాని రెండవ వారంలో కూడా లవ్‌ స్టోరీకి వసూళ్ల పరంపర కొనసాగబోతున్నట్లుగా ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు.

Telugu @republic, Love Story, Naga Chaitanya-Movie

రిపబ్లిక్ మూవీ తాజగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ సినిమా వల్ల ఖచ్చితంగా లవ్‌ స్టోరీ సినిమాకు పోటీ తప్పదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు.ఇండస్ట్రీలో కూడా లవ్‌ స్టోరీ సినిమా వసూళ్లు తగ్గే అవకాశం ఉంది అంటూ వార్తలు వచ్చాయి.

కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రిపబ్లిక్ మూవీ సో సో టాక్ తో నడుస్తోంది.మంచి మెసేజ్ అయితే ఉంది కాని కమర్షియల్‌ ఎలిమెంట్స్ లేవు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో లవ్‌ స్టోరీ మరో వారం రోజుల పాటు వసూళ్లను కుమ్ముకుంటుంది అంటూ ట్రేడ్‌ విశ్లేషకులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. లవ్ స్టోరీ సినిమా లో సాయి పల్లవి డాన్స్ మరియు చైతూ నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

వీరిది చాలా సహజమైన ప్రేమ కథ అన్నట్లుగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube