నాగ చైతన్యకు అమల అక్కినేని శుభాకాంక్షలు.. ఎందుకంటే?

అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లవ్ స్టోరీ.ఈ సినిమా ఈనెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Love Story Amala Akkineni Wishes Naga Chaitanya-TeluguStop.com

కరోనా పరిస్థితులను ఎన్నో అడ్డంకులను తొలగించుకుని ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటిరోజు భారీ కలెక్షన్లను రాబట్టింది.ఈ సినిమా విజయవంతం కావడంతో అక్కినేని అమల ఈ సినిమాపై స్పందించారు.

ఈ సందర్భంగా అక్కినేని అమల నాగచైతన్యకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.నీ లవ్ స్టోరీ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనకు ఎంతో సంతోషంగా ఉంది.

 Love Story Amala Akkineni Wishes Naga Chaitanya-నాగ చైతన్యకు అమల అక్కినేని శుభాకాంక్షలు.. ఎందుకంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మరింత విజయం కావాలని కోరుకుంటున్నాను.ఆల్ ది బెస్ట్ చై అంటూ అమల ఈ సందర్భంగా నాగచైతన్యకు శుభాకాంక్షలను తెలియజేశారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులలో ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకోగలదన్న సందేహాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.ఇందులో నాగచైతన్య రేవంత్ అనే మధ్యతరగతి అబ్బాయి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.

ఈ సినిమాకు సాయి పల్లవి డాన్స్ లో మరింత హైలైట్ అయ్యాయని చెప్పవచ్చు.

#Naga Chaitanya #Sai Pallavi #Love Story #Amala Akkineni

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు