నీ ప్రేమ నిజమో కాదో అని అమ్మాయి తండ్రి ప్రూవ్ చేయమంటే..ఆ యువకుడు ఏం చేసాడో తెలుసా.?

ప్రస్తుత రోజుల్లో ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేసే​ యువకులే ఎక్కువగా ఉన్నారు.ప్రేమించలేదంటూ యాసిడ్‌ దాడులు, ప్రాణాలు తీస్తున్న జనరేషన్‌ ఇది.

 Love Prove Cheyamani Adigithe-TeluguStop.com

కానీ ఇప్పటికీ నిజాయితీగా ప్రేమించేవారు ఉన్నారని నిరూపించాడు ఓ యువకుడు.ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా వెనుకాడలేదు.

భోపాల్ లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరో జన్మంటూ ఉంటే ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఉందన్న ప్రియుడు ‘నీ ప్రేమ నిజమైనదైతే కాల్చుకుని నీ ప్రేమను నిరూపించుకో’ అని తన ప్రియురాలి తండ్రి తనతో అనగా ఓ యువకుడు నిజంగానే తుపాకీతో కాల్చుకుని మృతి చెందిన ఘటన మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని అరోరా మండలంలో చోటు చేసుకుంది.

వివరాల లోకి వెళ్తే.

భోపాల్‌లోని అరోరా మండలానికి చెందిన అతుల్‌ లఖండే భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) మండల ఉపాధ్యాక్షుడిగా పనిచేస్తున్నాడు.కాగా గత కొంత కాలంగా అదే మండలానికి చెందిన బ్యాంక్‌ ఉద్యోగినితో ప్రేమలో ఉన్నాడు.వీరి పెళ్లికి అమ్మాయి తండ్రి నిరాకరించాడు.

దీంతో అతుల్‌కి, ఆమె తండ్రికి మధ్య గొడవలు అయ్యాయి.ఒకానొక దశలో అతుల్‌ బెదిరింపులకు కూడా దిగాడు.

దీంతో అమ్మాయిని తీసుకొని ఎంపీనగర్‌కు షిప్ట్‌ అయ్యారు.

అయినా అతుల్ వాళ్ళింటికి వెళ్లడం మానలేదు.

ఓరోజు అతుల్‌తో అమ్మాయి తండ్రి ‘ నీది ప్రేమకాదు మోజు’ అన్నాడు.అంతటితో ఆగకుండా ‘ఒకవేళ నీ ప్రేమ నిజమైతే నిన్ను నువ్వు చంపుకుని నిరూపించుకో.

అప్పుడు నువ్వు బతికుంటే నా కూతుర్ను ఇచ్చి పెళ్ళి చేస్తా.లేదంటే వచ్చే జన్మలో నా కూతుర్ని పెళ్ళి చేసుకో’ అని సవాల్ విసరడంతో అతుల్ ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు.

దీంతో మంగళవారం రాత్రి 9.30గంటలకు ప్రియురాలి ఇంటికి వెళ్లిన అతుల్‌ అందరూ చూస్తుండగానే తుపాకితో తలను కాల్చుకున్నాడు.అక్కడే ఉన్న అతుల్‌ బంధువు, అతని ప్రియురాలు కలిసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు డాకర్లు తెలిపారు.

కాగా చనిపోవడానికి ఒక రోజు ముందు అతుల్‌ ఫేస్‌బుక్‌లో తన బాధను పంచుకున్నాడు.

‘ నా ప్రేయసి తండ్రి నా ప్రేమను నిరూపించుకునేందుకు ఒక టాస్క్‌ ఇచ్చాడు.నన్ను నేను కాల్చుకొని నా ప్రేమను నిరూపించుకుంటాను.ఆమె లేని జీవితం నాకు వద్దు.ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం.

దయచేసి ఆమెను ఎవరూ నిందించకండి.మళ్లి జన్మంటూ ఉంటే తనను పెళ్లి చేసుకోవాలని ఉంది’ అంటూ ప్రియురాలితో కలిసి దిగిన 40 ఫోటోలను పోస్ట్‌ చేశాడు.

అయితే ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఎవరిమీదా కేసు నమోదు చేయకపోవడం వెనక రాజకీయం దాగివుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.కాగా అతని స్నేహితులు మాత్రం అతుల్‌ గత 13 సంవత్సరాలుగా ఆ యువతిని ప్రేమిస్తున్నాడని, వారి పెళ్లికి యువతి తండ్రి నిరాకరించాడని ఆరోపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube