నీ ప్రేమ నిజమో కాదో అని అమ్మాయి తండ్రి ప్రూవ్ చేయమంటే..ఆ యువకుడు ఏం చేసాడో తెలుసా.?     2018-07-05   00:33:04  IST  Raghu V

ప్రస్తుత రోజుల్లో ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేసే​ యువకులే ఎక్కువగా ఉన్నారు. ప్రేమించలేదంటూ యాసిడ్‌ దాడులు, ప్రాణాలు తీస్తున్న జనరేషన్‌ ఇది. కానీ ఇప్పటికీ నిజాయితీగా ప్రేమించేవారు ఉన్నారని నిరూపించాడు ఓ యువకుడు. ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా వెనుకాడలేదు. భోపాల్ లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరో జన్మంటూ ఉంటే ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఉందన్న ప్రియుడు ‘నీ ప్రేమ నిజమైనదైతే కాల్చుకుని నీ ప్రేమను నిరూపించుకో’ అని తన ప్రియురాలి తండ్రి తనతో అనగా ఓ యువకుడు నిజంగానే తుపాకీతో కాల్చుకుని మృతి చెందిన ఘటన మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని అరోరా మండలంలో చోటు చేసుకుంది. వివరాల లోకి వెళ్తే..

భోపాల్‌లోని అరోరా మండలానికి చెందిన అతుల్‌ లఖండే భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) మండల ఉపాధ్యాక్షుడిగా పనిచేస్తున్నాడు. కాగా గత కొంత కాలంగా అదే మండలానికి చెందిన బ్యాంక్‌ ఉద్యోగినితో ప్రేమలో ఉన్నాడు. వీరి పెళ్లికి అమ్మాయి తండ్రి నిరాకరించాడు. దీంతో అతుల్‌కి, ఆమె తండ్రికి మధ్య గొడవలు అయ్యాయి. ఒకానొక దశలో అతుల్‌ బెదిరింపులకు కూడా దిగాడు. దీంతో అమ్మాయిని తీసుకొని ఎంపీనగర్‌కు షిప్ట్‌ అయ్యారు.