లవ్ మ్యారేజ్ చేసుకొని...చివరికి విడాకులు తీసుకొని విడిపోయిన 10 మంది సినీ జంటలు వీరే..!       2018-07-08   00:14:56  IST  Raghu V

గత కొన్ని రోజులనుండి సోషల్ మీడియాలో రేణు దేశాయ్ రెండో పెళ్లి పైనే ఎక్కువ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు సినిమా వాళ్లు ఎవరు తమ కో స్టార్స్ ని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నారో చూద్దాం…

కమల్ హాసన్ మొదట డ్యాన్సర్ వాణి గణపతిని పెళ్లి చేసుకున్నారు..వాణి గణపతితో కమల్ ది పెద్దలు కుదిర్చిన పెళ్లి.పదేళ్ల వివాహ బంధం తర్వాత కమల్ ,వాణికి విడాకులు ఇచ్చి సారిక ని పెళ్లి చేసుకున్నారు.శృతి,అక్షర ఇద్దరు సారిక కి పుట్టిన పిల్లలే.సారిక కు కూడా విడాకులు ఇచ్చి గౌతమితో సహజీవనం చేసారు కమల్..గౌతమి కి మొదటి భర్త ద్వారా సుబ్బలక్ష్మి అనే కూతురుంది.కమల్ పిల్లలు శృతి,అక్షర ..గౌతమితో కానీ,సుబ్బలక్ష్మితో కాని అన్యోన్యంగానే ఉండేవారు.కానీ సడన్ గా గౌతమి,కమల్ లు కూడా ఇప్పుడు వేరుగా ఉంటున్నారు.

పవర్ స్టార్ పవన్ కి నందిని అనే వైజాగ్ అమ్మాయితో పెళ్లి విడాకులు అయ్యాయి.రేణుదేశాయ్ తో సహజీవనం చేసారు పవన్ కళ్యాణ్ .వీరికి ఆద్య,అకిరా అని ఇద్దరు పిల్లలున్నారు.కానీ ఏడేళ్ల క్రితం పవన్ కి విడాకులిచ్చి అన్నా లెజెనోవాని పెళ్లి చేసుకున్నారు.అన్నా లెజొనేవా రష్యన్ కి చెందిన నటి..తీన్ మార్ సినిమాలో పవన్ తో కలిసి నటించింది.పవన్ కి అన్నా లెజోనెవా కి పోలేనా అనే కూతురుంది.ఇటీవల వీరిరువుకు బాబు పుట్టాడు.

రాధిక 1985 లో ప్రతాప్ పోతన్ ని పెళ్లి చేసుకుంది.కానీ వెంటనే విడాకులు తీసుకుంది.ప్రతాప్ పోతన్ కూడా నటుడే..తర్వాత రిచర్డ్ హార్డీని పెళ్లి చేసుకుంది..అతనికి విడాకులిచ్చి 2001 లో శరత్ కుమార్ ని వివాహం చేసుకుంది.

నాగార్జున కి మొదటి వివాహం లక్ష్మితో 1984లో జరిగింది.లక్ష్మి ,మూవి మెగల్ రామానాయుడు కూతురు.విక్టరీ వెంకటేశ్ చెల్లెలు.నాగార్జున,లక్ష్మిల కుమారుడే నాగచైతన్య..లక్ష్మితో విడాకులనంతరం నాగార్జున అమలను వివాహం చేసుకున్నాడు.అమల,నాగార్జున ల కుమారుడు మన సిసింద్రీ అఖిల్.

సుమంత్ గోదావరి ,సత్యం సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ,తొలిప్రేమ సినిమా హీరోయిన్ కీర్తి రెడ్డిది ప్రేమ వివాహం.వీరి వివాహం 2004లో జరగగా ,2006 లో విడాకులు తీసుకున్నారు.ఇప్పటికీ సుమంత్ ఒంటరిగా ఉండగా,కీర్తి రెడ్డి వేరే అతన్ని వివాహం చేసుకుంది.

-

ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా మొదట రమలత ని వివాహం చేసుకున్నారు .వీరికి ముగ్గురు పిల్లలు,తర్వాత నయనతార తో ప్రేమాయణం నడిపి రమలత కు విడాకులిచ్చారు.కానీ నయనతారతో వివాహం రద్దైంది.

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మొదటి భార్య లలితాకుమారి.వీరి పెళ్లి 1994లో జరిగింది. ఈవిడ ఎవరో కాదు శ్రీహరి వైఫ్ డిస్కోశాంతికి స్వయానా అక్క.లలితకుమారి కి 2009లో విడాకులిచ్చి,2010లో పోనివర్మని వివాహం చేసుకున్నారు ప్రకాశ్ రాజ్.

శరత్ బాబు 1981లో రమాప్రభని వివాహం చేసుకున్నారు.ఆ తర్వాత రమాప్రభకి 1998లో విడాకులిచ్చి స్నేహలతా కుమారి అనే ఆవిడను పెళ్లి చేసుకున్నారు.ఆమె కు కూడా విడాకులిచ్చారు.ఇప్పుడు నటి నమితతో సహజీవనం చేస్తున్నారనే వార్తలొస్తున్నాయి.కానీ శరత్ బాబు వీటిని ఖండించారు.

ఊర్వశి ముందుగా విజయ్ కె జయన్ అనే నటున్ని వివాహం చేసుకుంది.తర్వాత అతడికి 2008 లో విడాకులిచ్చి ,2013లో శివప్రసాద్ ని పెళ్లి చేసుకుంది.ఇతను చెన్నైలో బిల్డర్..వీరికి ఒక మగబిడ్డ ఉన్నాడు.