తాగుడుకి విరుగుడు లవ్ హార్మోన్! ఆవిష్కరించిన అమెరికా శాస్త్రవేత్తలు

ప్రేమతో ఏదైనా సాధ్యం అవుతుంది అని ఎప్పుడు ఓ మాట అందరూ చెబుతూ ఉంటారు.కాని ప్రేమించడం ఎలాగో చాల మందికి తెలియదు అని చెప్పాలి.

 Love Hormone Reduce Thedrugs Addictions-TeluguStop.com

అలాగే ప్రేమలో భావోద్వేగాలు మాత్రమే ఉంటాయని అందరికి తెలుసు.కాని భావోద్వేగాలలో అసలు నిజమైన ప్రేమకి సంబంధించిన ఫీలింగ్ ని ఎవరు తెలుసుకోలేరు.

కాని ప్రేమతో ఏవైనా సాద్యం అవుతాయో లేదో తెలియదు కాని లవ్ హార్మోన్ తో మాత్రం త్రాగుడు మానేలా చేయవచ్చని అమెరికా పరిశోధకులు అంటున్నారు.

లవ్‌ హార్మోన్‌ ఆక్సిటోసిన్‌ తాగుడు మాన్పించేందుకూ దోహదపడుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు.

మనిషిలో ప్రేమ, ఉద్వేగాలు ఉప్పొంగినప్పుడు మెదడు ఈ హార్మోన్‌ను స్రవిస్తుంది.అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌, స్ర్కిప్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఇటీవల ఓ పరిశోధన నిర్వహించారు.

కొన్ని ఎలుకలకు మద్యసేవనాన్ని అలవాటుచేశారు.కొంతకాలం తర్వాత ప్రతి రోజు వాటి ముక్కుభాగంలో కృత్రిమ ఆక్సిటోసిన్‌ను స్ర్పే చేయడం ప్రారంభించారు.

దాంతో అవిమధ్య తాగడం మానేశాయి.ఈ ప్రయోగం ద్వారా మద్యానికి బానిసలైన వారిని లవ్‌ హార్మోన్‌ నాసల్‌ ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube