హిజ్రాతో సహజీవనం చేస్తూ ... ఆమె గొంతుకోసి ....   Love Hijra Strangely Absconding Boyfriend     2018-10-24   16:30:41  IST  Sai M

ఒక హిజ్రాను ప్రేమించడమే కాకుండా గత మూడేళ్లుగా ఆమెతో సహజీవనం చేస్తూ .. చిన్నపాటి గొడవ కారణంగా తీవ్ర ఆవేశానికి లోనై ఆమె గొంతుకోసిన ప్రియుడు ఆ తరువాత పరారయినా సంఘటన మహబూబాబాద్‌ లో జరిగింది. వివరాలు పరిశీలిస్తే… మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంజనాపురానికి చెందిన బానోత్‌ రాధిక (హిజ్రా), కొత్తతండాకు చెందిన దారావత్‌ సురేశ్‌ మహబూబాబాద్ లోని రాధిక అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నారు.అయితే వీరిద్దరూ మూడేళ్ళుగా సహజీవనం చేస్తున్నారు.

సురేష్.. రాధిక వద్ద కట్నం పేరుతో రెండు లక్షలు తీసుకున్నాడు. ఇటీవల తనకు ఇంకా మూడు లక్షల రూపాయలు కావాలని రాధికను వేధించడం మొదలుపెట్టాడు. దాంతో వీరి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన సురేష్ ఆ రాత్రే కత్తితో రాధిక గొంతుకోసి పరారయ్యాడు. కుటుంబసభ్యులు గమనించి రాధికను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు