జబర్దస్త్.తెలుగు బుల్లి తెరపై ఈ షో చేసే సందడి అంతా ఇంతా కాదు.పంచులు కాస్త శ్రుతి మించినా సరే.నవ్వుల పువ్వులు పూయించడంలో చాలా సక్సెస్ అయ్యింది.ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు బయటి ప్రపంచానికి తెలిశారు.అయితే ఈ జబర్దస్త్ స్టేజి మీద చాలా జంటలు ప్రేమలో పడ్డాయి.అందులో తొలుత చెప్పుకోవాల్సింది యాంకర్ రష్మీ, సుధీర్ గురించి.వీరిద్దరిది నిజమైన ప్రేమా.
స్కిట్ కోసం అలా చేస్తున్నారా? తెలియదు కానీ.మంచి ఎంటర్ టైన్ మెంట్ మాత్రం అందిస్తున్నారు.
తాజాగా జబర్దస్త్ వేదిక మీద పలు జంటలు సందడి చేశాయి.ఇవి వాలెంటైన్స్ డే కోసం చేశాయా? లేక నిజంగానే చేశాయా? తెలియదు.ఇంతకీ ఏ జంటలు తమ లవ్ ప్రపోజ్ చేసుకున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాతజబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.
షో మొదలైన దగ్గరి నుంచి చిన్న పిల్లలను తన స్కిట్ లో పెట్టుకుని అద్భుతమైన కామెడీ చేస్తాడు.తాజాగా సీరియల్ యాక్టర్స్ తో స్కిట్స్ చేస్తున్నాడు.తాజాగా ఓ కొత్త అమ్మాయిని జబర్దస్త్ స్టేజి మీదకు తీసుకొచ్చాడు.ఆమే జోర్దార్ సుజాత.
ఒకప్పుడు కామెడీ వార్తలు చదివిన ఈ అమ్మాయి.ఆ తర్వాత బిగ్ బాస్ షోలోనూ సందడి చేసింది.
తాజాగా బుల్లితెరపై వరుస అవకాశాలు పొందుతుంది.పలు ఈవెంట్లు, కామెడీ షోలలో పాల్గొంటుంది.
సుజాత కూడా జబర్దస్త్ వేదిక మీద రాకేష్ టీంలో చాలా స్కిట్లు చేసింది.తాజాగా జబర్దస్త్ వేదికగా వీరు ప్రేమలో ఉన్నట్లు తెలిసింది.
*ప్రవీణ్- ఫహిమాఅటు ప్రవీణ్, ఫహిమాకు జబర్దస్త్ వేదిక మీది నుంచి లవ్ ప్రపోజ్ చేశాడు.లవ్ సింబల్ ఉన్న బెలూన్ తీసుకుని ప్రేమను వ్యక్త పర్చుకున్నారు.ఫహిమా తనకు ప్రతి విషయంలో తోడుంటుందని చెప్పాడు.
*నరేష్-షభుఅటు పొట్టి నరేష్, అందాల ముద్దుగుమ్మ షభు కూడా లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు తెలుస్తోంది.నరేష్ ఏకంగా తన గోల్డ్ చైన్ ను షభుకు గిఫ్ట్ గా ఇచ్చాడు.
*ఇమ్మాన్యుయేల్-వర్షవీరిద్దరు కూడా ప్రేమలో ఉన్నారు.
ఇమ్మాన్యుయేల్ కు జీవితాంతం తోడుగా ఉంటానని వర్ష ప్రామీస్ చేసింది.ప్రస్తుతం ఈ ప్రోమో బాగా వైరల్ అవుతోంది.
ఇదంతా వాస్తవమా? లేక షో కోసం అలా చేశారా? అనేది త్వరలో తేలనుంది.