మొసళ్ళ నదిలో దూకిన అమెరికన్..క్షేమంగా బయటకు...కానీ ట్విస్ట్ ఏంటంటే..!!!

అమెరికాలో ఓ యువకుడు చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.అందరూ చూస్తుండగా సుమారు 100 అడుగుల ఎత్తున్న నదిలోకి అమాంతం దూకేశాడు.

 Louisiana Man Bored In Traffic Jump Into River , Jamie Evan, The River Is About-TeluguStop.com

అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.అంతగా ఈ వీడియో వైరల్ అవడానికి కారణం ఎంటి, ఈ ఎపీసోడ్ లో ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే అసలు జరిగిందేంటో తెలియాల్సిందే.

వివరాలోకి వెళ్తే.

అమెరికాకు చెందిన జేమ్మీ ఇవాన్ అనే యువకుడు స్నేహితులతో కలిసి సరదాగా బయటకు వెళ్ళాడు.

అయితే వెళ్ళే మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో గంటల తరబడి అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పండి దాంతో ఏం తోచకపోవడంతో పక్కనే ఉన్న నదిలోకి దూకేశాడు.ఆ నది ఎత్తు దాదాపు 100 అడుగులు పైమాటేనట.

నదిని దూకే సమయంలో తన స్నేహితులు వీడియో కూడా తీశారు.అయితే అతడు నదిలోకి దూకిన విషయం కొంత దూరం నుంచీ చూసిన అధికారులు పరుగు పరుగున అతడి వద్దకు పరుగులు పెడుతూ వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు .

Telugu America, Crocodiles, Jamie Evan, Louisianabored, River Feet-Telugu NRI

ఎందుకంటే జేమ్మీ సరదాగా దూకిన నది పేరు అచ్చపాలయ నది.ఈ నదిలో అత్యధిక సంఖ్యలో మొసళ్ళు ఉంటాయట.దాంతో అధికారులు అతడిని వేగంగా ఒడ్డుకు రమ్మని, అందులో మొసళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నాయంటూ అరుస్తూ చెప్పారు.ఈ విషయం విన్న వెంటనే అతడికి వెన్నులో వణుకు పుట్టుకొచ్చింది.

మొసళ్ళు వచ్చేలోగా ఒడ్డుకు వచ్చేద్దామని అనుకున్న అతడికి ట్విస్ట్ ఎదురయ్యింది, అంత ఎత్తు నుంచీ దూకడం వలన కాలుకు గాయం అయ్యింది.దాంతో అలానే ఈదుకుంటూ భయంతో ఒడ్డుకు చేరుకున్నాడు.

అతి కష్టం మీద ఈదుకుంటూ వచ్చిన జేమ్మీకి పోలీసులు షాక్ ఇచ్చారు.నిభందల ప్రకారం ఈనదిలో ఎవరూ దూకిన నేరంగా పరిగణిస్తామని జేమ్మి అరెస్ట్ చేశారు.

ఒకరకంగా పోలీసులు తన ప్రాణాలు కాపాడారని వారు హెచ్చరించక పొతే నదిలోనే కాసేపు ఉండేవాడినని అధికారులకు కృతజ్ఞతలు చెప్పాడు జేమ్మీ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube