తులసి చెట్టుకు అంత మహిమా ఉంటుందా? తులసి గురించి నమ్మలేని నిజాలు

హిందువులు జంతువులు మరియు చెట్లలో కూడా దేవుడిని చూస్తారు, దేవుడిలా పూజిస్తారు.గోమాతను దేవతగా పూజించే హిందువులు తులసి చెట్టును కూడా చాలా గౌరవ ప్రధంగా పూజిస్థారు.

 Lot Of Uses If Tulasi Plant In House-TeluguStop.com

మహిళలు కొందరు ప్రతి రోజు తులసి చెట్టుకు పూజ చేస్తారు.తమ పసుపు కుంకుమ బాగుండాలని, ఎప్పటికి సంతోషంగా ఉండాలని తులసమ్మకు పూజ చేస్తారు.

ఇంటి ముందు తులసి చెట్టుకు ఒక దిమ్మె కట్టించి లేదంటే కోట కట్టించుకుని మరీ పూజ చేస్తారు.అయితే తులసి చెట్టులో కలిగే మార్పులను బట్టి ఇంట్లో పరిస్థితులను అర్ధం చేసుకోవచ్చు అని పెద్దలు అంటున్నారు.

తులసి చెట్టు వద్ద చాలా మంది దీపం పెడతారు, అది ఎంత మాత్రం కరెక్ట్‌ కాదు.ఎందుకంటే తులసి చెట్టు దీపం వేడికి లేదంటే పొగకు వాడిపోయే అవకాశం ఉంది.

అలా వాడిపోతే మళ్లీ తులసి చెట్టును పెంచుకోవాల్సి ఉంటుంది.అలా చెట్టు వాడిపోతే అపశృతి అనుకుంటాం.

తులసి చెట్టుకు అంత మహిమా ఉంటు�

ఒక వేళ చెట్టుకు దీపం పెట్టకున్నా కూడా వాడిపోయింది అంటే ఇంట్లో ఏదో అనర్ధం జరుగబోతుందని గ్రహించవచ్చు.

ఇక తులసి చెట్టు ఆకులు నల్లగా మారడంతో పాటు, చెట్టు మెల్ల మెల్లగా చనిపోవడం కూడా జరుగుతుంది.అలాంటి సమయంలో ఇంట్లో దుష్ట శక్తి ఉందని, ఇంటిపై చెడు దృష్టి పడ్డట్లుగా గ్రహించాలి.అలా జరిగినప్పుడు వెంటనే నష్టనివారణ చర్యలు తీసుకోవాలి.

ఇక తులసి చెట్టుకు బట్టలు ఉతికి జాడించిన నీటిని పోస్తూ ఉంటారు.అలా అస్సలు చేయకూడదు.

కనీసం బట్టలు పిండే సమయంలో కూడా చెట్టుపై నీళ్లు పడకుండా చూసుకోవాలి.

తులసి చెట్టు దైవంతో సమానం కనుక ఇంట్లో దేవుడిని ఎంత జాగ్రత్తగా చూస్తామో అంతే జాగ్రత్తగా చూసుకోవాలి.

అలాంటప్పుడు తులసి కుటుంబంను చల్లగా చూస్తుందని పెద్దలు అంటున్నారు.

ఉదయాన్నే తులసి చెట్టును ముట్టుకోవద్దు.

కనీసం పళ్లు కూడా తోముకోకుండా చెట్టును పట్టుకోవద్దు.ప్రతి రోజు స్నానం చేసిన తర్వాత తులసి చెట్టు నుండి ఒక ఆకును తీసుకుని నోటిలో వేసుకుంటే మంచి ప్రయోజనం కలుగుతుందని పెద్దలు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube