షేర్‌ చేయండి : మీకు తప్పిపోయిన పిల్లలు ఎవరైనా కనిపిస్తే ఈ పని చేస్తే వెంటనే వారి తల్లిదండ్రుల వద్దకు పంపవచ్చు

మారిన టెక్నాలజీని ఉపయోగించుకుంటే చాలా పనులు సులువు అవుతాయి.టెక్నాలజీతో ఎన్నో రోజులు తిరిగినా కాని పనులు నిమిషాల్లో అవుతున్నాయి.

 Lost Children-TeluguStop.com

కొన్ని సార్లు పదుల రోజులు పట్టే పని కూడా కేవలం ఒక్క రోజులో పూర్తి అవ్వడం జరుగుతుంది.ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ రంగాల్లో టెక్నాలజీ వల్ల ఎంతో మంది జరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

టెక్నాలజీ సాయంతో సామాన్యులు కూడా చాలా లాభపడుతున్నారు.అద్బుతమైన ప్రయోజనాలను పొందుతున్నారు.

ఇక తాజాగా మరో ఆసక్తికర విషయం గురించి సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… పెద్ద పెద్ద వేడుకల్లో కాని, ఏదైనా రద్దీ ఏరియాల్లో కాని పిల్లలను తప్పి పోవడం చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం.

ఇకపై అలా తప్పి పోయిన పిల్లల గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు.చాలా సులభంగా ఆ పిల్లలను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు వీలుగా ఆధార్‌ టెక్నాలజీని ఉపయోగించవచ్చు.

ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కరికి ఆధార్‌ ఉన్న విషయం తెల్సిందే.ప్రతి విషయానికి ఆధార్‌ తప్పనిసరి కనుక చిన్న పిల్లలకు కూడా ఆధార్‌ను తీస్తున్నారు.అందుకే ఆధార్‌ ద్వారా తప్పి పోయిన పిల్లలను తల్లిదండ్రుల వద్దకు అతి తక్కువ సమయంలోనే చేర్చే అవకాశం ఉంటుంది.

మీకు ఎవరైనా పిల్లలు తప్పి పోయి కనిపించినట్లయితే వెంటనే వారిని మీ సమీపంలో ఉన్న ఆధార్‌ కేంద్రం వద్దకు తీసుకు వెళ్లింది.

అక్కడ ఆధార్‌ ఇచ్చే అధికారి వారి ఫింగర్‌ ప్రింట్స్‌ మరియు ఐరీష్‌ ద్వారా వారి కుటుంబ సభ్యులను గుర్తిస్తాడు.అదే సమయంలో అతడి అడ్రస్‌, అతడి ఆధార్‌ ఏ ఫోన్‌ నెంబర్‌కు అనుసంధానం అయ్యి ఉంది అనే విషయాలను కూడా తెలియజేస్తాడు.

అలా తెలుసుకున్న తర్వాత ఆ ఫోన్‌ నెంబర్‌ను తీసుకుని, ఆ నెంబర్‌కు కాల్‌ చేస్తే వెంటనే వారు వచ్చి పిల్లాడిని తీసుకు వెళ్లే అవకాశం ఉంటుంది.ఒక వేళ ఆధార్‌ కార్డులో ఉన్న ఫోన్‌ నెంబర్‌ పని చేయకుంటే నేరుగా ఆ కార్డులో ఉన్న అడ్రస్‌కు వెళ్లినా కూడా పిల్లాడి గురించిన సమాచారం లభిస్తుంది.

కనుక అలా అయినా పిల్లాడిని తల్లిదండ్రులకు చేర్చవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube