నెల రోజుల్లో పాయల్ అన్ని కిలోలు తగ్గిందా..?

ఈ మధ్య కాలంలో హీరోయిన్లు అవకాశాలు సంపాదించుకోవడం కోసం బరువు తగ్గడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.బొద్దుగా ఉన్న హీరోయిన్లు బరువు తగ్గడంలో ఆశ్చర్యం లేకపోయినా స్లిమ్ గా ఉన్న హీరోయిన్లు సైతం బరువు తగ్గుతుండటం గమనార్హం.

 Losing Weight Is Refreshing For Payal Rajput , 6 Kilos, Losing Weight, Payal Raj-TeluguStop.com

పాయల్ రాజ్ పుత్ ఈ మధ్య కాలంలో స్లిమ్ లుక్ లో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే.ఈ బ్యూటీ నెల రోజుల్లో ఏకంగా ఆరు కిలోలు తగ్గారని సమాచారం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ హీరోయిన్ కు పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో ఈమె బాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.ఎంతో ఇష్టంగా తినే ఆహారాన్ని సైతం దూరం పెట్టి పాయల్ రాజ్ పుత్ బరువు తగ్గినట్టు తెలుస్తోంది.

అయితే కొందరు నెటిజన్లు పాయల్ స్లిమ్ లుక్ లో బాగుందని చెబుతుంటే మరి కొందరు నెటిజన్లు మాత్రం పాయల్ మునుపటి లుక్ లోనే బాగున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్ ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్ పుత్ కు భారీగా క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఆ క్రేజ్ ను వినియోగించుకొని అవకాశాలు, ఆఫర్లు అందుకోవడంలో పాయల్ ఫెయిల్ అయ్యారు. ఆర్ ఎక్స్ 100 తరువాత పాయల్ రాజ్ పుత్ నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడం వల్ల కూడా ఆమెకు ఆఫర్లు తగ్గినట్టు తెలుస్తోంది.

మరోవైపు తాజాగా ఈ హీరోయిన్ కరోనా వ్యాక్సిన్ ను వేయించుకున్నారు.

Telugu Kilos, Payal Rajput-Movie

వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్న సంగతి తెలిసిందే.పాయల్ రాజ్ పుత్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత తాను జ్వరం, ఒళ్లునొప్పులతో బాధ పడ్డానని వెల్లడించడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube