జాగ్రత్త...ఈ లక్షణం కూడా కరోనా లో ఒక భాగమేనట  

Losing Sense Of Taste And Smell Corona - Telugu Corona, Covid19, Losing Smell And Taste, Patients

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏ విధంగా వణికిస్తుందో తెలిసిందే.ఈ కరోనా మహమ్మారికి భయపడి దేశాలు షట్ డౌన్ కూడా ప్రకటించేశాయి.

 Losing Sense Of Taste And Smell Corona - Telugu Covid19 Patients

ప్రజలను కూడా ఇళ్లు దాటి బయటకు రావద్దని ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఇంటి నుంచే విధులు నిర్వహించాలి అంటూ స్పష్టం చేసింది.మరోపక్క విదేశాల నుంచి వచ్చిన వారిని తప్పనిసరిగా క్వారంటైన్ ను పాటించాలి అని,14 రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రాకుండా షరతులను పాటించాలి అంటూ కోరింది.
జలుబు, దగ్గు, జ్వరం ఇలా ఏ లక్షణాలున్నా వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని అధికారులు ప్రజలకు సూచించారు.అయితే కేవలం జలుబు, దగ్గు మాత్రమే కాకుండా వేరే లక్షణాలతో కూడా కరోనా బారిన పడుతున్నట్టు తన పరిశోధనలో తెలిసిందని ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇంతకీ ఆ లక్షణం ఏంటో తెలుసా వాసన చూసే స్వభావాన్ని కోల్పోవడం.ముఖ్యంగా యువత.ఉన్నట్టుండి వాసన చూసే స్వభావాన్ని కోల్పోయినట్టయితే.అది కరోనా పాజిటివ్ లక్షణం కావచ్చని ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు, బ్రిటిష్ డాక్టర్లు చెబుతున్నారు.

 Losing Sense Of Taste And Smell Corona - Telugu Covid19 Patients

జలుబు, దగ్గు లేకపోయినప్పటికి.ఈ లక్షణం ఉన్నట్టయితే కరోనా సోకినట్టు భావించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.కరోనా బారిన పడిన బాధితుల్లో కొంతమంది రుచిని చూసే స్వభావం కోల్పోవడం కూడా గమనించినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.వాసన చూసే స్వభావాన్ని కూడా కరోనా లక్షణాల జాబితాలోకి చేర్చాలని యూకేలోని ఈఎన్‌టీ నిపుణులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ప్రస్తుతం ఈ ఒక్క లక్షణంతోనే కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తుంది.

తాజా వార్తలు

Losing Sense Of Taste And Smell Corona Related Telugu News,Photos/Pics,Images..