బాబు క్యాబినెట్ లో ఓడనున్న ప్రముఖులు ఎవరంటే...!!!!  

Losers In Andhra Pradesh Elections From Tdp-janasena Party,tdp,tdp Winners,ys Jagana

 • ఏపీలో ఎన్నడూ లేనంతగా ఓటర్లలో చైతన్యం కలిగింది. కొన్ని నెలలుగా ఎప్పుడెప్పుడా అని వేచి చూసిన ఎన్నికలు రావడం, ఓటు హక్కుని ఓటరు వినియోగించుకోవడం, భారీ స్థాయిలో ఓట్లు పోలవ్వడం, ఎండని సైతం లెక్క చేయకుండా గంటల కొద్దీ క్యూలలో నుంచుని తమ తీర్పుని ఇచ్చేశారు.

 • బాబు క్యాబినెట్ లో ఓడనున్న ప్రముఖులు ఎవరంటే...!!!!-Losers In Andhra Pradesh Elections From TDP

 • ఇంకా కొన్ని రోజుల్లో ఎవరిని ఓటరు దేవుళ్ళు అధికారంలోకి తీసుకొస్తారోననే ఉత్ఖంటకి తెరపడుతుంది.అయితే పోలింగ్ తరువాత అంచనాలని బట్టి అధికార టీడీపీ కి చెందిన కొందరు కీలక నేతలు ఓడిపోతున్నట్టుగా పోలింగ్ సరళి చెప్తోంది.

 • టీడీపీలో చాలా మంది సీనియర్ నేతలు, ప్రముఖులు, కీలక పదవుల్లో ఉన్న వారందరూ ఓడిపోనున్నారని ప్రాధమికంగా ఓ సమాచారం అందుతోంది. తెలంగాణలో సీన్ మళ్ళీ ఏపీలో రిపీట్ అవుతోందని.

 • తెలంగాణలో కాంగ్రెస్ నుంచీ, టీడీపీ నుంచీ పోటీ చేసిన ఉద్దండ పిండాలు ఎలాగైతే ఓటమి పాలయ్యారో అలాగే ఏపీలో చంద్రబాబు టీం లో చాలా మంది ఓటమి చెందటం ఖాయమని డిసైడ్ అయ్యారు. అందుకు తగ్గట్టుగానే పోలింగ్ సరళి ఉందట.

 • ఇక ఓడిపోనున్న ప్రముఖుల వివరాలు పరిశీలిస్తే.

  గుంటూరు జిల్లాలో ఓ మంత్రి ఓటమి ఖాయమేనని ఆ నియోజకవర్గంలో పోలింగ్ సరళిని బట్టి చెప్తున్నారు.

 • గత రెండు ఎన్నికల్లోనూ స్వల్ప తేడాతో గెలిచిన ఆయన ఈ సారి మాత్రం ఓటమిని చవి చూడక తప్పదనే టాక్ వినిపిస్తోంది. అదే జిల్లాకి చెందినా మరొక సీనియర్ నేత ఓటమి అంచులలో ఉన్నట్టుగా టీడీపీ వర్గంలోనే ప్రచారం జోరుగా సాగుతోంది.

 • ఇక రాయలసీమ జిల్లాల్లో

  Losers In Andhra Pradesh Elections From TDP-Janasena Party Tdp Winners Ys Jagana

  ఎంపీగా పోటీ చేస్తున్న మరో మంత్రి ఘోరాతి ఘోరంగా ఓడిపోనున్నారట. కృష్ణా జిల్లాలో ఓ మంత్రి ఓటమి దాదాపు ఖారారు అయ్యిందనే టాక్ వినిపిస్తోంది.మరో మంత్రి సైతం అదే బాటలో పయనించనున్నారట.

 • సీమ జిల్లాల్లో ఇద్దరి మాజీ మంత్రులు కూడా ఓటమి అడుగులో అడుగు వేస్తున్నారట. కర్నూలులో ఓ కీలక నేత ఓటమికి ఎదురు ఈదుతున్నారట .

 • నెల్లూరు జిల్లాలోను ఇదే పరిస్థితి నెలకొంది. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఎన్నడూ లేనంతగా గట్టి పోటీ ఉండటంతో ఆయన పరిస్థితి కూడా ఆలోచించే విధంగా ఉందని, ఆయన ఓటమిని ఎవరూ ఆపలేరని అంటున్నారట.

 • ఇక టీడీపీకి కంచుకోట జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మంత్రి ఓడిపోతానని తెలిసి కులం కార్డును నమ్ముకున్నా గెలిచే పరిస్థితి లేదంటున్నారు.తూర్పు గోదావరి జిల్లాలో కూడా మంత్రుల ఓటమి ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి.

 • మొత్తంగా చూస్తే బాబు క్యాబినెట్ లో మంత్రులు, పార్టీ ప్రముఖులు అందరూ వరుసపెట్టి ఓటమిచెందనున్నారని టీడీపీ ప్రభుత్వం అధికారాన్ని వదులుకుని వైసీపీకి ఇవ్వడం మినహా చేసేది ఏమి లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.