డెలివరీ తర్వాత సులువుగా బ‌రువు త‌గ్గించే సూప‌ర్ టిప్స్‌!!

త‌ల్లి అవ్వ‌డం అనేది పెళ్లైన ప్ర‌తి మ‌హిళ ఒక వ‌రంలా భావిస్తుంది.గర్భం పొందిన క్షణం నుండి తొమ్మిది నెలలు నిండి డెలివ‌రీకి వెళ్ళే వరకు ఎన్నో బాధ‌లు, నొప్పులు ఎదుర్కొంటూనే ఉంటుంది.

 How To Lose Weight After Delivery. Lose Weight, Delivery, Tips For Lose Weight,-TeluguStop.com

ఇక డెలివ‌రీ టైమ్‌లో న‌ర‌క‌యాత‌న ప‌డుతున్నా.కడుపు చీల్చుకుని పుట్టిన బిడ్డను చూడగానే ఆ బాధ‌ల‌న్నీ మర్చిపోతుంది.

అయితే డెలివ‌రీ త‌ర్వాత మ‌హిళ‌ శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి.

ముఖ్యంగా డెలివ‌రీ త‌ర్వాత మ‌హిళ‌లందరు ఎదుర్కొనే సాధార‌ణ‌, ప్ర‌ధాన స‌మ‌స్య అధిక బ‌రువు.

ఈ క్ర‌మంలోనే బ‌రువు త‌గ్గేందుకు తిన‌డం మాసేసి అనేక ప్ర‌య‌త్నాలు చేసి.ఫ‌లితం లేక భంగ‌ప‌డ‌తారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ పాటిస్తే.సులువుగా బ‌రువు త‌గ్గొచ్చు.

ఒక క‌ప్పు నీటిలో అర స్పూన్ సోంపు, మ‌రియు రెండు యాల‌కులు వేసి బాగా మ‌రిగించాలి.

Telugu Delivery, Care, Tips, Latest, Lose, Tips Lose-Telugu Health

అనంత‌రం ఈ నీటిని వడగట్టి పరగడుపున గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగాలి.ఇలా ప్ర‌తి రోజు చేయ‌డం డెలివరీ తర్వాత సులువుగా బ‌రువు త‌గ్గొచ్చు.అలాగే నిద్రలేమి వలన బరువు పెరిగే అవకాశం ఉంది.

ముఖ్యంగా డెలివ‌రీ త‌ర్వాత మ‌హిళ‌లు త‌క్కువ‌గా నిద్ర‌పోతారు.కానీ, రోజుకు క‌నీసం ఎనిమిది నుంచి తొమ్మిది గంట‌లు ప‌డుకుంటేనే బ‌రువు త‌గ్గ‌గ‌ల‌రు.

అదేవిధంగా, డెలివ‌రీ త‌ర్వాత మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి.రోజుకి కనీసం మూడు లీటర్ల నీరు తాగ‌డం ఖ‌చ్చితంగా బ‌రువు త‌గ్గ‌గ‌ల‌రు.ప్ర‌తిరోజు క‌నీసం ప‌ది నిమిషాలు అయినా చిన్న చిన్న వర్కౌట్స్ కూడా చేయాలి.అలాగే ప్ర‌తి రోజు ఉద‌యం గోరువెచ్చన నీటిలో తేనె మ‌రియు నిమ్మ‌ర‌సం క‌లిసి తాగాలి.

దీంతో పాటు రోజుకు ఒక క‌ప్పు గ్రీన్ టీ తీసుకోవాలి.ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తే మంచి ఫ‌లితం పొందొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube