జాతీయ రహదారి టోల్ గేట్ లో లారీ భీభత్సం.. !

ప్రమాదాలు ఎవరికి చెప్పిరావు.అందులో రోడ్దు మీద ప్రయాణించే వారి వెంట ఎప్పుడు మృత్యువు నీడలా ఉంటుంది.

 Lorry Terror At National Highway 365 Toll Gate, Warangal District, Narsampet, Lo-TeluguStop.com

అందుకే అంటారు బయటకు వెళ్లిన వ్యక్తి ఇంటికి వచ్చే వరకు నమ్మకం తక్కువ అని.ఇకపోతే రహదారులు ఎక్కువగా దాహంతో అల్లాడిపోతుంటాయి కావచ్చూ.అందుకే ప్రమాదాల రూపంలో రక్తాన్ని తాగుతుంటాయి.

ఇకపోతే వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం పరిధిలోని ముత్తోజిపేట శివారులో జాతీయ రహదారి 365 టోల్ గేట్ దగ్గర ఓ లారీ బీభత్సం సృష్టించింది.

మల్లంపల్లి నుండి నర్సంపేట వైపుగా రోలర్ వీల్స్ తో బయలుదేరిన ఓ లారీ, సరిగ్గా హనుమాన్ తండా సమీపంలో గల టోల్ గేట్ దగ్గరికి చేరుకోగానే ప్రమాదానికి గురైంది.

Telugu Hanumanthanda, Lorry, Narsampet, Toll Gate, Warangal-Latest News - Telugu

ఆ లారీ ఒక్కసారిగా కుదుపులకు లోనవగా, రోలర్ వీల్స్ కు కట్టిన తాళ్లు తెగిపోయాయి.దీంతో ఆ రోలర్ వీల్స్ పక్కకు ఒరిగి టోల్ గేట్ లో టికెట్లు ఇచ్చే క్యాబిన్ పై పడిపోవడంతో క్యాబిన్ మొత్తం ధ్వంసం అయింది.అదీగాక పక్కనే ఉన్న ఓ కారుపై కూడా పడటంతో ఆ కారు కూడా డ్యామేజ్ అయ్యిందట.

కాగా ఈ ప్రమాదంలో బానోతు అశోక్ అనే వ్యక్తి ,క్యాబిన్ లోనే చిక్కుకుపోగా, వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రున్ని బయటకు తీశారు.ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితుణ్ణి ఆస్పత్రికి తరలించారు.

సంఘటన పై విచారణ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube