ప్చ్ ... వెంకన్న స్వామికి తగ్గిన ఆదాయం...!

కలియుగ దైవం ఏడుకొండల వాసుడు వెంకన్న స్వామి కి తన ఆదాయం కోల్పోయాడు.కరోనా రాకముందు ప్రతినెల స్వామి గారి ద్వారా టీటీడీకి 200 నుంచి 220 కోట్ల వరకు ఆదాయం వచ్చేది.

 Venkateswar Swamy, Tirumala Tirupathi, Hundi, Daily Income, Lord Venkateswara Sw-TeluguStop.com

అయితే కరోనా పుణ్యమా అని భక్తుల్ని తిరుమల కొండ మీదకి స్వామివారి దర్శనానికి పంపక పోవడంతో పూర్తిగా స్వామి వారి ఉండి ఆదాయం తగ్గిపోయింది టిటిడికి.ఇకపోతే తాజాగా గత నెల రోజుల్లో తిరుమల వెంకన్న స్వామిని రెండున్నర లక్ష మంది దర్శనం చేసుకున్నారు.

ఇక వీరితో శ్రీవారి హుండీ ద్వారా కేవలం 14 కోట్ల వరకు ఆదాయం లభించింది.

భారతదేశంలో కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి ఆలయాలు పూర్తిగా మూసివేసిన సంగతి అందరికీ విదితమే.

ఈ సందర్భంగా మార్చి 20వ తేదీ నుండి మే 7 వరకు తిరుమలలోని స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతి లభించలేదు.అయితే మార్చి 20 ముందు వరకు తిరుమలలో స్వామివారిని దర్శించుకునేందుకు ఏకంగా 80 వేల నుండి లక్ష మంది దాకా ప్రతి రోజు దర్శించుకునే వారు.అయితే జూన్ 7 నుండి అన్ లాక్ 1.0 ద్వారా వచ్చిన సడలింపుల కారణంగా రోజుకి తిరుమలేశుని దర్శించుకోవడానికి పరిమిత సంఖ్యలో కేవలం ఆరు వేల మందికి మాత్రమే దర్శన భాగ్యం కల్పించారు టిటిడి బృందం.

Telugu Hundi-

దీనితో వందల కోట్ల నుండి కేవలం 14 కోట్లకే స్వామి వారి హుండీ ఆదాయం పరిమితం అయ్యింది.నిజానికి లాక్ డౌన్ సమయంలో కేవలం స్వామి వారి ఏకాంత సేవలను అక్కడ ఉన్న పూజారులు మాత్రమే నిర్వహించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube