శ్రీకృష్ణుడు అష్ట భార్యలు గురించి తెలుసా?

శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు అని అందరికి తెలుసు.అయితే వారి గురించిన వివరాలు మాత్రం చాలా మందికి పూర్తిగా తెలియదు.ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం.

 Lord Sreekrishna And His Wives Unknown Facts-TeluguStop.com

1.రుక్మిణి

విదర్భరాజు భీష్మకుని కూతురు.వాళ్ళ అన్న రుక్మిని ఎదిరించి కృష్ణుణ్ణి వివాహం చేసుకుంది.

2.సత్యభామ

సత్రాజిత్తు కూతురు.కృష్ణుణ్ణి అపనిందలకి గురి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసెను.

3.జాంబవతి

జాంబవంతుడికి అడవిలో ఒక పాప దొరికితే తెచ్చి జాంబవతి అని పేరు పెట్టి పెంచుకున్నాడు.కృష్ణుడు సత్రాజిత్తు పోగొట్టుకున్న శమంతకమణిని వెతికితెచ్చే ప్రయత్నంలో జాంబవంతునితో యుద్ధంచేసి గెలిచిన తర్వాత జాంబవతిని వివాహం చేసుకున్నాడు.

4.మిత్రవింద

అవంతి రాజుకు తోబుట్టువు.ఆమెకు శ్రీకృష్ణుడు అంటే విపరీతమైన ప్రేమ.ఆ కారణంగా మిత్రవింద స్వయంవరంలో శ్రీకృష్ణుడు ఆమెను అపహరించి వివాహం చేసుకొనెను.

5.కాళింది

ఈమె సూర్యుని కుమార్తె.విష్ణువుని భర్తగా కోరి తపస్సు చేస్తే ఈ కృష్ణ అవతారంలో ఆమె కోరికను తీర్చాడు.

6.నాగ్నజిత్తి

కోసలరాజు నగ్నజిత్తు కుమార్తె.అసలు పేరు సత్య.

ఈ రాజు తన దగ్గరున్న బలమైన ఏడు గిత్తల్ని ఎవరు లొంగదీసుకుంటే వారికీ తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని వీర్యశుల్కం ఏర్పాటుచేశాడు.కృష్ణుడు ఆ పనిచేసి నాగ్నజితిని వివాహం చేసుకొనెను.

7.భద్ర

కృష్ణుని మేనత్త శృతకీర్తి కూతురు.ఆమెను స్వయంవర మండపం నుండి ఎత్తుకువెళ్లి వివాహం చేసుకొనెను.

8.లక్ష్మణ

మద్రదేశ రాకుమారి.స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని ఛేదించి వివాహం చేసుకొనెను.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube