శివుడికి అభిషేకం చేస్తే కోటీశ్వరులు అవుతారని మీకు తెలుసా?

శివుడిని అభిషేక ప్రియుడు అని అంటారు.అలాంటి శివునికి ఎంతో ప్రత్యేకమైన రోజు సోమవారం నాడు అభిషేకం చేయడం వల్ల స్వామి వారి అనుగ్రహం కలిగి కోరిన సంపదలు మన వెంటే వస్తాయి.

 Lord Siva Abhishekam Will Do Richest Persons Lord Shiva, Abhishekam, Hindu Beli-TeluguStop.com

సోమవారం శివునికి పూజలు చేయడం ద్వారా శుభం జరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.పురాతన కాలం నుంచి మన దేశంలో శివునికి ఎంతో ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు.

మీకు ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్న శివునికి అభిషేకం చేయడం ద్వారా ఈతిబాధలు తొలగిపోయి ఆర్థికంగా ఎటువంటి సమస్యలు ఉండవు.అయితే శివునికి ఏ ఏ పదార్థాలతో అభిషేకం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

శివుడిని నీటితో అభిషేకం చేయడం ద్వారా ఎంతో ప్రసన్నుడవుతాడు.అందువల్ల ప్రతి శివాలయంలోని శివుని లింగం పైభాగంలో ఒక నౌకను వేలాడదీస్తారు.

అందులోనుంచి శివలింగం మీద నీరు పడుతున్నట్లు ఉంటుంది.నీటితో అభిషేకం చేయడం ద్వారా మన మనసు ఎంతో ప్రశాంతంగా కలిగి ఉండటమే కాకుండా, ప్రతికూల వాతావరణం నుంచి మనకు విముక్తి లభిస్తుంది.

శివుడికి పాలాభిషేకం చేయడం ద్వారా దీర్ఘకాలికంగా వెంటాడుతున్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.అంతేకాకుండా , సర్వ సౌఖ్యములు కలుగుతాయి.

శివుడికి అత్యంత ప్రీతికరమైన దళాలు మారేడు దళాలతో స్వామివారికి అభిషేకం చేయడం ద్వారా భోగభాగ్యాలు కలుగుతాయి.స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం ద్వారా మృత్యుదోష నివారణ లు కలగడమే కాకుండా శని ప్రభావం నుంచి విముక్తి పొందవచ్చు.

అన్నంతో అభిషేకం చేయడం వల్ల అధికార ప్రాప్తి, కొబ్బరి నీటితో అభిషేకం వల్ల సకల సంపదలు కలుగుతాయి.

సోమవారం నాడు శివునికి భక్తి భావంతో అభిషేకం చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం కలిగి అనుకున్న కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తుంటారు.

శివునికి సోమవారం తెల్లని పుష్పాలతో అలంకరించి పూజలు చేయడంవల్ల స్వామి వారు ఎంతో ప్రసన్నులు అవుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube