తెల్ల అన్నంతో శివుడిని ఆరాధిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

అన్నం పరబ్రహ్మస్వరూపం అని అంటారు.తెల్లని అన్నంతో చేసే పూజలతో అనేక లాభాలు పొందుతారు అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

 Lord Shiva Prayers With White Rice-TeluguStop.com

అన్ని దానాలలోకల్లా అన్నదానం గొప్పది.మరి అలాంటి అన్నంతో భగవంతుని ఎలా పూజించాలో ఇక్కడ తెలుసుకుందాం.

తెల్లని అన్నంతో శివలింగాన్ని చేసి, ఆ శివలింగాన్ని పూజించి దానిని నదిలో వదిలితే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగవు.ఎంత దారిద్య్రంలో ఉన్నా ఎంత పేదరికంలో ఉన్న కూడా ధనవంతులవుతారు.

 Lord Shiva Prayers With White Rice-తెల్ల అన్నంతో శివుడిని ఆరాధిస్తే ఏం జరుగుతుందో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెల్లటి అన్నాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టి, ఆ అన్నంలో పంచదార తేనెను కలిపి పశువులకు పెట్టి, అవివాహితులకు తాంబూలం ఇచ్చి, కాళ్లకు నమస్కరించడం ద్వారా మనకు రావాల్సిన అంత నగదు త్వరగా వస్తుంది.

తెల్లటి అన్నానికి తేనెను కలిపి దానిని నైవేద్యంగా ఉంచితే వారికి ఎటువంటి చర్మ సంబంధిత వ్యాధులు రావు.తెల్లటి అన్నంలోకి నల్లటి నువ్వులను కలిపి వాటిని శనీశ్వరునికి నైవేద్యంగా పెట్టి దానిని కాకులకు పెట్టడం వల్ల పితృదేవతల శాపాలు తొలగిపోతాయి.ఎవరైతే తెల్లటి అన్నంలోకి తేనే, పంచదారను కలిపి కుల దేవతకు నైవేద్యంగా పెట్టి అన్నదానం చేస్తారో అలాంటి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని వేద పండితులు చెబుతున్నారు.

తెల్లని అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి ఇంటి దైవానికి నైవేద్యం పెట్టి, దానిని ఇతరులకు దానం చేయడం ద్వారా మన ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో కలిగి ఉంటారు.చాలావరకు మనసుకి ప్రశాంతత కలుగుతుంది.

చూశారు కదా అన్నంతో శివునికి ఇలా పూజ చేయడం ద్వారా ఆ బోలా శంకరుడి అనుగ్రహం కలిగి ఆ ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతోను కలిగి ఉంటారు.

#White Rice #Lord Shiva

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL