న్యూజెర్సీ లో సాయిదత్త పీఠం..ఆధ్యాత్మిక ప్రదర్శన..!!!!

భారతీయులు విదేశాలలో ఎక్కడ ఉన్నా సరే హిందూ సాంప్రదాయాలని, పండుగలని ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఉంటారు.ఆధ్యాత్మక కార్యక్రమాల నిర్వహణని మాత్రం ఎప్పటికప్పుడు పాటిస్తూనే ఉంటారు.

 Lord Sai Baba Temple In New Jersey-TeluguStop.com

తాజాగా అమెరికాలోని న్యూజెర్సీ లో సాయి దత్త పీటం ఆధ్వర్యంలో ఏక్ మే అనేక్ అనే ఓ ప్రదర్శనని నిర్వహించి ఎంతో మంది సాయి భక్తులని, భారతీయులని ఆకట్టుకున్నారు.ఈ ఆధ్యాతిమిక ప్రదర్శనకి ఎంతో మంది తెలుగువారితో పాటు భారతీయులు కూడా పాల్గొన్నారు.

న్యూజెర్సీ ప్లయిన్ పీల్డ్ లో సాయి సమర్పణ్ బృందం ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించింది.సహజంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలని చాలా తక్కువ మంది హాజరవుతారు,కానీ ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి చాలా మంది పోటీ పడ్డారు భిన్నత్వంలో ఏకత్వం.

ఇదే సాయి తత్వం అంటూ ఎంతో హృదయ రంజకంగా ఆధ్యాంతం ఎంతో ఆశక్తిగా సాగింది.వారి నటన తీరు ప్రశంసకుల మన్ననలు అందుకుంది.

సాయి తత్వాన్ని చక్కని భావోద్వేగాల మధ్య సంగీతంతో ఈ బృందం ప్రదర్శించి ఆకట్టుకుంది.హేమాడ్ పంత్ దాభోల్కర్ రాసిన ఈ నృత్యరూపం సాయి భక్తులని భక్తి పారవశ్యంలో మునిగేలా చేసింది.

దేవుడు మనుషుల్లో మావనత్వాన్ని మేల్కొలిపెందుకు మానవరూపంలో మన మధ్యకి వచ్చాడు అనేది ఈ నాటిక ముఖ్య ఉద్దేశ్యం.ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులు అందరూ సాయిదత్త పీఠం వారిని అభినందించి వెళ్ళడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube