ఏంటి నిజామా? పిల్లి ఉద్యోగం చెయ్యడం ఏంటి రిటైర్ అవ్వడం ఏంటి అని మీకు డౌట్ వచ్చి ఉండచ్చు.కానీ నిజంగానే ఓ పిల్లి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యింది.
దీంతో ఆ పిల్లికి తోటి స్టాప్ గ్రాండ్ సెండాఫ్ పార్టీ కూడా ఇచ్చారు.ఎక్కడ? ఎవరు అనుకుంటున్నారు.అక్కడికే వస్తున్న.
పూర్తివివరాల్లోకి వెళ్తే.బ్రిటన్ రాజధాని లండన్‌లోని ఫారెన్ అండ్ కామన్వెల్త్ ఆఫీసులో లార్డ్ పామర్స్టన్ అనే పిల్లి ఉద్యోగం చేస్తుంది.అయితే మనుషులకు రిటైర్ మెంట్ ఉన్నట్టే పిల్లులకు కూడా రిటైర్ మెంట్ ఉంది.
దీంతో ఆ పిల్లికి కూడా రిటైర్మెంట్ సమయం వచ్చింది.అలాగే రిటైర్ అయ్యింది.
ఇంతకు ఆ పిల్లి ఎం పని చేస్తుందో చెప్పలేదు కదా! ఎం లేదు అంది సాధారణంగానే పిల్లి తనకు ఎంతో చిరాకు తెప్పించే ఎలుకలను పట్టి చంపేసే పని దానిది.ఆ ఆఫీస్ లో ఉండే ఎలుకల్ని పట్టటం కోసమే ఆ పిల్లిని 2016లో పామర్స్టన్ అనే ఆశ్రయం నుండి తెప్పించి మరి దానికి ఆ ఉద్యోగం ఇచ్చారు.
ఆ పిల్లి ఇప్పుడు రిటైర్ అయ్యింది.దీంతో ఆ ఆఫీస్ స్టాఫ్ అంత కూడా ఆ పిల్లికి పెద్ద పార్టీ ఇచ్చి వీడ్కోలు పలికారు.
ఇంకా ఈ విషయాన్నీ ఎఫ్సీఓలోని సర్ సైమన్ మక్‌డొనాల్డ్ అనే ఓ ఉన్నతాధికారి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.”నాలుగేళ్ల క్రితం పామర్స్టన్ ఈ ఆఫీసుకు వచ్చింది.ఏదో ఎలుకలు పట్టడానికి తనను తెచ్చామని అనుకున్నాం కానీ.ఆ పిల్లి సోషల్ మీడియా స్టార్‌ను ఆఫీసుకు తీసుకొచ్చారని ఊహించలేకపోయా.ప్రస్తుతం లాక్‌డౌన్‌ను చక్కగా ఎంజాయ్ చేస్తున్న పామర్స్టన్కు రిటైరమెంట్ ఇవ్వాలని అందరం నిర్ణయించాం” అని అయన ట్విట్టర్ లో చెప్పుకొచ్చారు.దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.