బ్రిటన్: లేబర్ పార్టీకి భారత సంతతి నేత రాజీనామా

బ్రిటన్ రాజకీయాల్లో అత్యంత సుపరిచితులు, సీనియర్ రాజకీయ వేత్త, రచయిత భారత సంతతికి చెందిన మేఘనాధ్ దేశాయ్ లేబర్ పార్టీకి రాజీనామా చేశారు.యాంటీసెమిటిక్ జాత్యహంకారాన్ని సమర్థవంతంగా పరిష్కరించడంలో విఫలమైనందున తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ఆయన తెలిపారు.80 ఏళ్ల మేఘనాధ్ తాను ఎల్లప్పుడూ లేబర్‌ పార్టీకి మద్ధతుదారుడినేనని చెప్పారు.

 Indian-origin Peer Lord Meghnad Desai Resigns From Labour Party Over Racism,  Me-TeluguStop.com

కాగా, కొన్నేళ్లుగా లేబర్ పార్టీ యాంటిసెమిటిజం ఆరోపణలతో బాధపడుతోంది.

డిసెంబర్ 2019 ఎన్నికల్లో ఘోర పరాజయానికి దారి తీసిన కారణాల్లో ఇది కూడా ఒకటి.సర్ కైర్ స్టార్మర్ ఈ ఏడాది లేబర్ పార్టీ నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు.

పార్టీలో సమానత్వం కోసం పాటుపడతానని.తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని స్టార్మర్ చెప్పారు.

అయితే మానవ హక్కుల కమీషన్ ఫలితాలను తక్కువ చేసినట్లు తేలడంతో గత నెలలో జెరిమి కార్బిన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించి స్టార్మర్ సంచలనం రేపారు.

Telugu Indianorigin, Meghnad Desai, Racism-Telugu NRI

తాను యాంటి సెమిటిక్ పార్టీ లో కొనసాగలేనని.అలాగే మరే ఇతర పార్టీలో చేరే ఉద్దేశం తనకు లేదని దేశాయ్ రాజీనామా అనంతరం అన్నారు.ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను హౌస్ ఆఫ్ లార్డ్స్‌లోని లేబర్ పార్టీ నాయకుడు బారోనెస్ ఏంజెలా స్మిత్‌కు పంపాడు.

రాజీనామా నిర్ణయంపై మరోసారి పున: పరిశీలించాల్సిందిగా అనేక మంది మేఘనాధ్‌పై ఒత్తిడి తెస్తున్నారు.పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో స్వతంత్ర సభ్యుడిగా కూర్చుంటారు.

గుజరాత్‌లోని వడోదరాలో 10 జూలై 1940న జన్మించిన మేఘనాధ్.14 ఏళ్లకే మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు.రామ్‌నారాయణ్ రుయా కాలేజ్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు.యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ చేశారు.అలాగే పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి 1960లో పీహెచ్‌డీ అందుకున్నారు.బ్రిటీష్ లేబర్ పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైన ఆయన 1986 నుంచి 1992 మధ్యకాలంలో ఆ పార్టీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు.

ఆయన చేసిన సేవలకు భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డుతో గౌరవించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube