హనుమంతుడు ఇంకా భూమి మీదే ఉన్నాడు .. ఇవిగో సాక్ష్యాలు  

Lord Hanuman Stills Exist On Earth – Proofs -

పవన పుత్రుడు ఇంకా భూమి మీద నివసిస్తన్నాడా? తన భక్తులకి ఊహించని రూపాల్లో దర్శనమిస్తూ దైవం మీద నమ్మకాన్ని పెంచుతున్నాడా? ఈ విశ్వం ఉన్నంతవరకు రామాయణం గురించి మాట్లాడుకుంటారు అంటారు, అలాగే రామాయణం గురించి జనాలు మాట్లాడుకుంటున్నంతవరకు హనుమంతుడు ఉంటాడంటారు .మనం ఇంకా రామాయణం గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం.

మరి హనుమంతుడు ఇంకా భూమి మీద ఉన్నట్టేనా? ఉంటే మన కనులకి ఎందుకు కనబడటం లేదు? అసలు ఉన్నాడా లేదా? ఈ సాక్ష్యాలు చూస్తోంటే ఉన్నాడనే అనిపిస్తోంది.

Lord Hanuman Stills Exist On Earth – Proofs-Devotional-Telugu Tollywood Photo Image

* హనుమంతుడుకి ఉన్న మరోపేరు చిరంజీవి.

అంటే అర్థం ఎప్పటికీ జీవించి ఉండేవాడు.అక్కడే మనకు అర్థం అవ్వాలి, హనుమంతుడు ఎప్పటికి ఇక్కడే ఉంటాడని.

* రామాయణం పూర్తవగానే రాముడు, సీత అంతా భూమిని విడిచి వెళ్ళిపోయారు .కాని హనుమంతుడు భూమిని విడిచినట్టుగా ఎక్కడా వ్రాసిలేదు.

* హనుమంతుడు సత్య యుగంలో రుద్రుడి రూపంలో ఉండేవాడు.అంటే హనుమంతుడు త్రేతాయుగానికి ముందునుంచే మన పురాణాలకి తెలుసు.

* త్రేతాయుగంలో రుద్రుడు హనుమంతుడిగా జన్మించి, అదే రూపంలో చిరంజీవిగా ఉంటాడని పురాణాలు చెప్పాయి.ఈ యుగంలోనే రామాయణం జరిగింది.

* ద్వాపరయుగంలో కూడా హనుమంతుడు ఉన్నాడు.జెండపై కపిరాజుగా మారి కురుక్షేత్రాన్ని నడిపించాడు కూడా.ఇప్పుడు కలియుగంలో కూడా తమకి దర్శనమిచ్చాడని భక్తులు అంటున్నారు.అన్ని యుగాల్లో ఉన్నాడు, ఇకపై ఉంటాడు కాబట్టే హనుమంతుడు చిరంజీవి.

* హనుమంతుడు విశ్వరూపం దాల్చిన పాదముద్రలు చాలాదేశాల్లో కనిపిస్తాయి.అంత పెద్ద మనిషిని మనం ఎరుగం.

ఆ పాదముద్రలు హనుమంతుడివి కాక ఇంకెవరివి?

* తాము వానరడైన హనుంతుడిని చూసాం అని ఒకరు కాదు ఇద్దరు కాదు, వందలమంది భక్తులు చెప్పారు.ఆయన అందరికి దర్శనమివ్వడు, ఎవరో ఉంటారు అదృష్టవంతులు.

* హనుమంతుడి గుడిల దగ్గర కోతులు ఉంటాయి.వీటి వెనుక ఏం సైన్సు ఉంటుంది.

ఉదాహరణకు కొండగట్టునే తీసుకోండి.వేలకొద్ది కోతులని అక్కడకి ఎవరు రప్పించారు? అవే అక్కడే హనుమంతుడిని ఆరాధిస్తూ ఎందుకు ఉంటున్నాయి?

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Lord Hanuman Stills Exist On Earth – Proofs Related Telugu News,Photos/Pics,Images..

DEVOTIONAL

footer-test