కోటిన్నర కొట్టేసిన నిత్య పెళ్లి కూతురు..!  

ఇటీవల కాలంలో నిత్య పెళ్లి కూతుర్ల సంఖ్య ఎక్కువ అయిపోతుంది.సాధారణంగా నిత్య పెళ్లి కొడుకులు ఉండే వారు కానీ ఇప్పుడు నిత్య పెళ్లి కూతుర్ల సంఖ్య ఎక్కువ అయిపోతుంది.

TeluguStop.com - Looteri Dulhan Two Men Rs 1 5 Crore Mother In Law Third Groom

తాజాగా ఇప్పుడు ఓ నిత్యపెళ్లికూతురు సంగతి తెర మీదకు వచ్చింది.ఆమె కథ చదివితే అందరూ షాక్ అవ్వాల్సిందే మరి.అలా ఉంది ఆమె కథ! ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

TeluguStop.com - కోటిన్నర కొట్టేసిన నిత్య పెళ్లి కూతురు..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

జార్ఖండ్ లో ఓ మహిళ తన అందమైన ఫోటోలను షాదీ డాట్ కామ్ అనే సైట్ లో పెట్టి బాగా డబ్బున్న వ్యక్తితో పరిచయం పెంచుకొని 2015లో అతన్ని పెళ్లి చేసుకుంది.అనంతరం భర్తకు ఆ మాట ఈ మాట చెప్పి రెండు సంవత్సరాల్లో కోటి రూపాయిలు లాగేసింది.

ఇంకా అతని దగ్గర ఎం లేవు అని తెలుసుకొని అతన్ని వదిలేసి ఒకరోజు వెళ్లిపోయింది.

ఆ తర్వాత మరో మాట్రిమోనియల్ సైట్ లో పేరు మర్చి తన ప్రొపైల్ పెట్టి మరొకరిని ఇలాగె పెళ్లి చేసుకుంది.

ఈసారి గుజరాత్‌కి చెందిన అమిత్ మోదీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని 2 ఏళ్లలో 45 లక్షల రూపాయిలు లాగేసింది.అతని దగ్గర డబ్బు ఏమి లేదని తెలుసుకొని విడాకులు కోరింది.

విడాకులు ఇవ్వను అని చెప్పే సరికి అక్కడ నుండి గుట్టు చెప్పుడు కాకుండా బయటకు వచ్చేసింది.

ఇంకా ఇప్పుడు పుణెలోని వ్యక్తిని బుట్టలో వేసుకొని పెళ్లి చేసుకొని కాలిఫోర్నియాకు వెళ్ళాలి అనుకుంది.

అయితే ఫోన్ కి ఎలాంటి పాస్‌వర్డూ పెట్టకపోవడంతో పెళ్ళికొడుకు తల్లి అందులోని ఫోటోలు అన్ని చూసింది.దీంతో పెళ్లి అపి నిత్య పెళ్లి కూతురును పోలీసులకు పట్టించింది.

దీంతో నిత్య పెళ్లి కూతురు కాస్తా జైలు ఖైదీగా మారిపోయింది.ఆమె ఇద్దరు భర్తలు ఆమె నుండి వారి డబ్బు లాగేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

మరి డబ్బు వెనక్కి వస్తుందేమో చూడాలి.

#Looteri Dulhan #Two Men #Third Groom #Mother In Law #Pune

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Looteri Dulhan Two Men Rs 1 5 Crore Mother In Law Third Groom Related Telugu News,Photos/Pics,Images..